తెరంగేట్రానికి సిద్ధం..! | Rajasekhars Daughter Looks Stunning | Sakshi
Sakshi News home page

తెరంగేట్రానికి సిద్ధం..!

Published Wed, May 31 2017 10:23 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

Rajasekhars Daughter Looks Stunning

ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ హీరో రాజశేఖర్, ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నా.. సక్సెస్ మాత్రం దక్కటం లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని.. త్వరలో గరడువేగ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అదే సమయంలో తాను హీరోగా ఉండగానే తన వారసురాలిగా కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ప్లాన్లో ఉన్నాడు రాజశేఖర్. ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు శివానిని ఇంట్రడ్య్సూ చేసేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.

చాలా కాలంగా రాజశేఖర్ కూతురు శివాని తెరంగేట్రంపై వార్తలు వినిపిస్తున్నాయి. జీవితా రాజశేఖర్లు కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తామని కన్ఫామ్ చేసినా.. అది ఎప్పుడన్నది చెప్పలేదు. అయితే ఇటీవల శివానితో చేయించిన ఓ ఫోటో షూట్ ఆమె మూవీ ఎంట్రీపై చర్చకు కారణమైంది. గ్లామరస్ లుక్లో హీరోయిన్కు కావాల్సిన అన్ని ఫిచర్స్తో అదరగొడుతుంది శివాని. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలను చూసి టాలీవుడ్ ప్రియాంక చోప్రా అంటున్నారు సినీ జనాలు. లుక్స్ పరంగా సూపర్బ్ అనిపించుకున్న శివానీ నటిగానూ ఆకట్టుకుంటే స్టార్ స్టేటస్ అందుకోవటం పెద్ద కష్టమేమీకాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement