న్యూ ఇయర్, సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని ప్రముఖ కొరియర్ సంస్థ గరుడ వేగ.. కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఏఈలతో సహా సుమారు 200 దేశాలకు తమ సేవలను విస్తరించిన గరుడ వేగ.. విదేశాల్లోని భారతీయులు, పండుగ సందర్భంగా ఇక్కడున్న తమ వారికి పంపే గిఫ్టులు.. తమవారి నుంచి అక్కడకు చేర్చాల్సిన పండగ రుచులను చేరవేయడానికి భారీ ఆఫర్లను ప్రకటించింది.
గరుడ బజార్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, డిజైనర్ బ్యాంగిల్స్ లో ప్రత్యేకమైన వాటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ప్రత్యేక స్వీట్లు ఇప్పుడు ఎక్కువమంది విక్రేతల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా 20 శాతం డిస్కౌంట్ను ప్రకటించడమే కాకుండా పొంగల్ కూపన్ కోడ్ ద్వారా మరో 5 శాతం రాయితీని ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
'గరుడ' సంక్రాంతి ఆఫర్లు
Published Fri, Jan 8 2016 2:01 PM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM
Advertisement
Advertisement