సినీ నటి జీవితా రాజశేఖర్‌ను టార్గెట్ చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన కేసులో చెన్నైవాసి నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనూ అతడు నటీనటులతో పాటు నిర్మాతలను మోసం చేసినట్లు తెలుస్తోంది. కాగా జీవితకు కొన్నాళ్లక్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తనను ఫారూఖ్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అంటూ మాటలు కలపడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించింది.
దీంతో అతడు జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు 50 శాతం డిస్కౌంట్‌లో వస్తాయని నమ్మబలికాడు. రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.1.25 లక్షలకే వస్తున్నట్లు తెలిపాడు. ఇది నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలు అతడికి ఆన్‌లైన్‌లో పంపారు. తర్వాత అటువైపు ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు.
చదవండి: మార్ఫింగ్ ఫోటోలు వైరల్.. పవిత్ర లోకేశ్ ఫిర్యాదు
అమ్మాయిల పిచ్చి రూమర్‌పై కాంతారావు కూతురు స్పందన
Comments
Please login to add a commentAdd a comment