సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మదీవెన’. శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి మారయ్య, ఎత్తరి చిన మారయ్య, ఎత్తరి గురవయ్యలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఆడియన్స్ నుంచి పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను నటి, దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ విడుదల చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రైలర్ విడుదల చేసిన అనంతరం జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘అమ్మ దీవెన డైరెక్టర్ శివ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. ఈ చిత్ర హీరోయిన్ ఆమని మంచి నటి. రాజశేఖర్‌తో అమ్మా కొడుకు మూవీలో నటించినప్పటి నుంచి ఆమని నాకు పరిచయం. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మేము ఆమని మంచి హీరోయిన్ అవుతుందని అనుకున్నాము, అలాగే ఆమని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తరువాత తాను మంచి చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు తగ్గాయి, మళ్లీ కొత్త దర్శకులు సమంత, తాప్సి వంటి వారితో మంచి సినిమాలు తీస్తున్నారు. స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు. అమ్మదీవెన సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరి ఆధర అభిమానాలు పొందాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
‘ట్రైలర్ లాంచ్ చేసిన జీవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆమని గారికి కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా మిగులుతుంది, సినిమా చాలా బాగా వచ్చింది. ఒక బాధ్యతలు లేని భర్తతో ఐదుగురు పిల్లల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడింది. వారిని ఎలా ప్రయోజకుల్ని చేసింది అనేది కథాంశం’ అని నిర్మాత మారయ్య అన్నారు. పోసాని, నటరాజ్, శ్రీ పల్లవి, శరణ్య, సత్యప్రకాష్, శృతి, యశ్వంత్, నాని యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి వెంకట్ అజ్మీర సంగీతమందిస్తున్నాడు.
జీవిత చేతుల మీదుగా ‘అమ్మ దీవెన’ ట్రైలర్..
Published Sat, Feb 15 2020 8:17 PM | Last Updated on Sat, Feb 15 2020 8:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment