
కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు జీవిత రాజశేఖర్‌లు సంతాపం తెలిపారు. ‘హరికృష్ణగారు మా కుటుంబంలోని వ్యక్తి. మా ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఆయన హాజరై ప్రత్యేక అభిమానంతో పలకరించేవారు. ఎంతో మనోబలాన్ని అందించేవారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేరంటే జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. చాలా బాధగా ఉంది. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ సహా ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. హరికృష్ణగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం’ అన్నారు.
బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో నెల్లూరు జిల్లాలో ఓ వివాహవేడుక వెళ్తున్న హరికృష్ణ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment