రజనీకాంత్‌ 'లాల్‌ సలాం' ట్రైలర్‌ విడుదల | Lal Salaam Trailer Out Now | Sakshi
Sakshi News home page

Lal Salaam Trailer: రజనీకాంత్‌ 'లాల్‌ సలాం' ట్రైలర్‌ విడుదల

Published Tue, Feb 6 2024 8:06 AM | Last Updated on Tue, Feb 6 2024 10:56 AM

Lal Salaam Trailer Out Now - Sakshi

రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లాల్‌ సలాం'. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌  అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్‌ తర్వాత రజనీకాంత్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్‌లో ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

ఫిబ్రవరి 9న లాల్‌ సలాం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమాల స్పీడ్‌ పెంచేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమళ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. రజనీ పాత్ర ఎంతో పవర్​ ఫుల్​గా కనిపిస్తోంది.  ఏడేళ్ల తర్వాత  ఐశ్వర్య రజనీకాంత్​ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించారు.

సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్‌ దిగ్గజం ఏఆర్‌ రెహమాన్‌ ఈ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి 'లాల్‌ సలామ్‌' చిత్రంలో వినిపించారు. 'తిమిరి ఎళుడా..' అనే ఈ సాంగ్‌ ఇ‍ప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

'లాల్‌ సలాం'లో రజనీకాంత్‌ మొయిద్దీన్‌ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ సీనియర్‌ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement