జి. సీతారెడ్డి, జహీదా, జీవిత, అద్వైత్
‘‘ఏ నిర్మాతకైనా తాను నమ్ముకున్న దర్శకుడు మంచి చిత్రాన్ని తీసినప్పుడు గొప్ప సంతృప్తి దొరుకుతుంది. ఆ సినిమా ప్రేక్షకులకు కూడా నచ్చి సూపర్ హిట్ అయితే అదే నిజమైన ఆనందం. ‘ఎంతవారలైనా’ చిత్రం ట్రైలర్, పాటలు బాగున్నాయి. సినిమా ఘనవిజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత కె. అచ్చిరెడ్డి. అద్వైత్, జహీదా శ్యామ్, అలోక్ జైన్, సీతారెడ్డి ముఖ్య పాత్రల్లో గురు చిందేపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతవారలైనా’. సంహిత, చిన్ని–చింటు సమర్పణలో రామదూత ఆర్ట్స్ పతాకంపై జి.సీతారెడ్డి నటించి, నిర్మించిన ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.
నటి, దర్శక–నిర్మాత జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘సీతారెడ్డిగారి భార్య లక్ష్మీగారిని నేను ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కలిశా. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘వ్యాపారవేత్త సీతారెడ్డి నిర్మాణ రంగంలోకి వచ్చి, ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న ఔత్సాహిక నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచారు’’ అన్నారు దర్శకుడు మదన్. ‘‘సినిమా రంగం ఎలా ఉంటుందోనని భయపడ్డా. కానీ ప్రతి ఒక్కరూ మంచి సహకారాన్ని అందించారు’’ అన్నారు జి. సీతారెడ్డి. ‘‘న్యూ జనరేషన్ హారర్ థ్రిల్లర్ ఇది. ఎంతవారలైనా శిక్షార్హులే అనే నేపథ్యంలో సాగుతుంది’’ అన్నారు గురు చిందేపల్లి.
Comments
Please login to add a commentAdd a comment