సాక్షి, సినిమా : టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జీవిత సోదరుడు మురళి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచి, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలె నటుడు రాజశేఖర్ తల్లి మరణించగా.. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరోకటి చోటు చేసుకోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కాగా, రాజశేఖర్ తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీమియర్ షోకి మెగా స్టార్ చిరంజీవిని జీవితా రాజశేఖర్ ఆహ్వానించారు కూడా. మరి ఇప్పుడు ఈ విషాదం సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment