సాక్షి, హైదరాబాద్ : దాదాపు దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ జీవితల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవిని విమర్శించానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని రాజశేఖర్, జీవితలు వదులుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిరంజీవి, రాజశేఖర్‌లకు పడటం లేదనేది పాత మాట. ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు రాజశేఖర్ జీవిత దంపతులు.
తాజాగా రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి జీవితతో కలిసి వెళ్లారు. అక్కడ వారికి చిరు ఫ్యామిలీ నుంచి సాదర స్వాగతం లభించింది. అంతే మరుసటి రోజు న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి చేరింది. అయితే దురదృష్టవశాత్తుగా రాజశేఖర్ కుటుంబసభ్యుడు మురళి మృతిచెందడంతో చిరంజీవి వెల్లాల్సిన ప్రీమియర్ షో రద్దు అయింది.
ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినా, చిరు-రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు. చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారని, కానీ తాము తరచుగా సినిమా వేడుకలు, సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే వుంటామని జీవిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment