PSV Garuda Vega
-
అందువల్లనే థియేటర్లకు రావడం లేదేమో!
‘‘నా స్వస్థలం ఏలూరు. సినిమాలంటే ఆసక్తి. దర్శకుడు కావాలన్నది నా గోల్. నాన్నగారి సలహా మేరకు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎడిటింగ్‌లో పీజీ డిప్లొమా చేశా’’ అన్నారు ఎడిటర్ ధర్మేంద్ర కాకరాల. రాజశేఖర్ హీరోగా ప్రవీణ్‌సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వరరాజు నిర్మించిన ‘పి.ఎస్.వి గరుడవేగ’ సినిమాకి ధర్మేంద్ర ఎడిటర్‌గా వర్క్ చేశారు. ‘‘నా తొలి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ‘గరుడవేగ’ అని ధర్మేంద్ర చెబుతోన్న విశేషాలు... ► ఎడిటర్లు శ్రీకర్‌ప్రసాద్, మార్తాండ్ కె. శంకర్లు నాకు స్ఫూర్తి. ఎడిటర్‌గా ‘ప్రస్థానం’ నా తొలి సినిమా. ఎడిటర్ శ్రవణ్ నా బ్యాచ్‌మేట్. తను బిజీగా ఉండటంతో ఆ సినిమా అవకాశాన్ని నాకు ఇప్పించారు. ఆ సినిమా తర్వాత అవకాశాల కోసం ఎదురుచూసే అవసరం రాలేదు. ఫిల్మ్ ఎడిటింగ్కీ, డిజిటల్ ఎడిటింగ్కీ మాన్యువల్ వర్క్ తగ్గిందే తప్ప... బ్రెయిన్ పరంగా కాదు. డిజిటల్ ఎడిటింగ్‌లో సగం టైమ్ తగ్గుతోంది. నాగచైతన్య ‘దడ’ ఎడిటర్‌గా నాకు పెద్ద సినిమా. నా మూడో సినిమా కూడా! భారీ డిజాస్టర్ అది. అందుకే పెద్ద సినిమా అవకాశాలు రాలేదనుకుంటున్నా. ► మన సినిమాలు జనరల్‌గా 2కె ఔట్పుట్లోనే ఉంటాయి. ‘బాహుబలి’ తర్వాత ‘గరుడవేగ’కి మాత్రమే 4కె రిజల్యూషన్ అవుట్‌పుట్ ఇచ్చాం. అందుకే క్వాలిటీకి అంత అభినందనలొస్తున్నాయి. 4కె టెక్నాలజీలో చేయాలంటే ఖర్చు ఎక్కువ. అందువల్ల, నిర్మాతలు ఒప్పుకోరు. ఫిల్మ్ క్వాలిటీగా ఉంటేనే... ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఇప్పుడు యూట్యూబ్‌లో క్వాలిటీ పెంచుకుని చూస్తే ఎలా ఉంటుందో... స్క్రీన్‌పైనా అలాగే ఉంటోంది. అందుకే, థియేటర్స్‌కి ప్రేక్షకులు తగ్గిపోతున్నారేమో! అని నా ఫీలింగ్. ► ట్రైలర్స్ కట్ చేసేవాళ్లు ఎడిటర్ కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. అది పబ్లిసిటీ. ‘గరుడవేగ’ ఎడిటింగ్‌కి 195 రోజులు వర్క్ చేశాం. ► రెండేళ్ల తర్వాత డైరెక్షన్ చేద్దామనుకుంటున్నా. కథ రెడీ చేసుకుంటున్నా. పుల్లెల గోపీచంద్ బయోపిక్‌తో పాటు శ్రేష్ట్ మూవీస్‌లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వం చేయబోతున్న సినిమాలకు నేను పనిచేయబోతున్నా. -
చిరుతో విభేదాలపై జీవిత కామెంట్..
సాక్షి, హైదరాబాద్ : దాదాపు దశాబ్దం క్రితం మెగాస్టార్ చిరంజీవి, రాజశేఖర్ జీవితల మధ్య విభేదాలు తలెత్తాయి. ప్రజారాజ్యం పార్టీ పెట్టే సమయం నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో చిరంజీవిని విమర్శించానికి వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని రాజశేఖర్, జీవితలు వదులుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. చిరంజీవి, రాజశేఖర్‌లకు పడటం లేదనేది పాత మాట. ప్రస్తుతానికి తమ మధ్య ఏ విభేదాలు లేవంటున్నారు రాజశేఖర్ జీవిత దంపతులు. తాజాగా రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ గరుడ వేగ సినిమా ప్రీమియర్ షోకి మెగాస్టార్‌ని ఆహ్వానించడానికి జీవితతో కలిసి వెళ్లారు. అక్కడ వారికి చిరు ఫ్యామిలీ నుంచి సాదర స్వాగతం లభించింది. అంతే మరుసటి రోజు న్యూస్ హెడ్లైన్స్లోకి చేరింది. అయితే దురదృష్టవశాత్తుగా రాజశేఖర్ కుటుంబసభ్యుడు మురళి మృతిచెందడంతో చిరంజీవి వెల్లాల్సిన ప్రీమియర్ షో రద్దు అయింది. ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినా, చిరు-రాజశేఖర్ ఒక్కటయ్యారనే వార్త మాత్రం సినీ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. గరుడ వేగ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జీవిత ఈ విషయంపై మాట్లాడుతూ.. చిరుతో తమకెప్పుడూ ఏ రకమైన విభేదాలు లేవని అన్నారు. చిరంజీవిని కలిసిన ప్రతీసారి ఏదో వింత జరిగినట్టుగా చూస్తారని, కానీ తాము తరచుగా సినిమా వేడుకలు, సినీ ప్రముఖుల ఫంక్షన్స్‌లో కలుస్తూనే వుంటామని జీవిత అన్నారు. -
నటుడి ఇంట మరో విషాదం
సాక్షి, సినిమా : టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జీవిత సోదరుడు మురళి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. ఆయన పార్ధివ దేహాన్ని ఉదయం 9.30 నుంచి గంటన్నర పాటు జూబ్లీహిల్స్ ఫిలించాంబర్ లో ఉంచి, ఆపై మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలె నటుడు రాజశేఖర్ తల్లి మరణించగా.. ఆ బాధ నుంచి తేరుకోకముందే మరోకటి చోటు చేసుకోవటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, రాజశేఖర్ తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ' రేపు విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీమియర్ షోకి మెగా స్టార్ చిరంజీవిని జీవితా రాజశేఖర్ ఆహ్వానించారు కూడా. మరి ఇప్పుడు ఈ విషాదం సినిమా విడుదలపై ప్రభావం చూపుతుందా? అన్నది చూడాలి. -
పీఎస్వీ గరుడవేగ ట్రైలర్ రిలీజ్
-
గరుడవేగలో సన్నీలియోన్
అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా అలరించిన రాజశేఖర్ మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పి.ఎస్.వి.గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న రాజశేఖర్ కు ఈ సినిమా కం బ్యాక్ ఫిలిం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాలో హాట్ బ్యూటి సన్నిలియోన్ గరుడ వేగలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ న్యూస్ వినిపిస్తున్నా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ముంబై ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో రాజశేఖర్, సన్నీలియోన్ ల కాంబినేషన్ లో పాటను చిత్రీకరిస్తున్నారు. 'గందిబాత్...', 'రాం చాహే లీల చాహే...' లాంటి బాలీవుడ్ సూపర్‌హిట్స్‌కు కొరియోగ్రఫీ అందించిన విష్ణుదేవా ఈ పెప్పి బీట్ ను కంపోజ్ చేస్తున్నారు.