గరుడవేగలో సన్నీలియోన్
అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా అలరించిన రాజశేఖర్ మరోసారి అదే తరహా పాత్రలో కనిపించనున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో పి.ఎస్.వి.గరుడవేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొద్ది రోజులుగా సక్సెస్ లు లేక ఇబ్బందుల్లో ఉన్న రాజశేఖర్ కు ఈ సినిమా కం బ్యాక్ ఫిలిం అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమాలో హాట్ బ్యూటి సన్నిలియోన్ గరుడ వేగలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ న్యూస్ వినిపిస్తున్నా చిత్రయూనిట్ మాత్రం కన్ఫామ్ చేయలేదు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ముంబై ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో రాజశేఖర్, సన్నీలియోన్ ల కాంబినేషన్ లో పాటను చిత్రీకరిస్తున్నారు. 'గందిబాత్...', 'రాం చాహే లీల చాహే...' లాంటి బాలీవుడ్ సూపర్‌హిట్స్‌కు కొరియోగ్రఫీ అందించిన విష్ణుదేవా ఈ పెప్పి బీట్ ను కంపోజ్ చేస్తున్నారు.