రాజశేఖర్‌ కుమార్తెపై కేసు నమోదు | case field on rajasekhar's daughter shivani | Sakshi
Sakshi News home page

రాజశేఖర్‌ కుమార్తెపై కేసు నమోదు

Published Mon, Nov 6 2017 12:29 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

case field on rajasekhar's daughter shivani - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: సినీనటుడు రాజశేఖర్ కుమార్తె శివానిపై హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిలిపి ఉన్న కారును జీవితా రాజశేఖర్‌ కారు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.73లో జీవితా రాజశేఖర్‌ కుమార్తె లాండ్‌ క్రూయిజర్‌ ఏపీ 13ఈ 1234 కారు నడుపుతూ వస్తూ అదే రోడ్డులో ఓ ఇంటి ముందు నిలిపిన కొత్త జీప్‌ కారును బలంగా ఢీకొట్టింది. దీంతో జీప్‌ కారు పక్కనే ఉన్న గోడను బలంగా తాకి స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ఘటనలో జీప్‌ ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీవిత అక్కడికి చేరుకొని దెబ్బతిన్న కారు యజమానితో మాట్లాడారు.

ఈ ఘటనపై ఎస్‌పీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌ సీనియర్ ఆపరేషనల్ మేనేజర్ అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. శివాని యాక్సిడెంట్ గురించి శనివారం రాత్రే వార్తలు వచ్చినా కేసు నమోదు కాకపోవడంతో అధికారికంగా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా 'పిఎస్‌వి గురుడవేగ' మూవీ విజయోత్సవ సంబరాల్లో ఉన్నారు. 'పిఎస్‌వి గరుడవేగ' సినిమా విడుదల ముందు రాజశేఖర్ కూడా పీవి ఎక్స్‌ప్రెస్ వే మీద మరో కారును ఢీ కొట్టిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement