Jeevitha Rajasekhar Gives Clarity On Cheating Case, Details Inside - Sakshi
Sakshi News home page

Jeevitha Rajashekar Cheating Case: అరెస్ట్‌ వారెంట్‌పై స్పందించిన జీవితా రాజశేఖర్‌

Published Sat, Apr 23 2022 1:07 PM | Last Updated on Sat, Apr 23 2022 3:45 PM

Jeevitha Rajasekhar Gives Clarity On Cheating Case, Details Inside - Sakshi

సినీ నటి, దర్శకురాలు జీవితపై నగరి కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే.  జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ నుంచి రూ. 26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తాజాగా ఈ ఆరోపణలపై జీవిత వివరణ ఇచ్చారు. శనివారం జరిగిన శేఖర్‌ మూవీ ప్రెస్‌మీట్‌లో ఆమె మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు జీవిత.. తనకు సమన్లు వచ్చిన విషయం నిజమే అన్నారు. కానీ తాను అరెస్ట్‌ కాలేదన్నారు. 

రెండు నెలలకుపైగా నగరి కోర్టులో ఈ కేసు నడుస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పుడు వారు మీడియా ముందుకు ఎందుకు వచ్చారో తెలియదని, ఇంతకు ముందు కూడా తనపై వారెంట్‌ వచ్చిందని చెప్పారు. అయితే ఆ కేసు తానే గెలిచినట్లు జీవిత తెలిపారు. రూ. 26 కోట్లు మోసం చేశారని జోష్టర్ ఫిలిం సర్వీసెస్ అధినేత కోటేశ్వర్‌రావు అంటున్నారని, అవి ఏ కోట్లో అర్థం కావడం లేదన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, అవన్ని తప్పుడు ఆరోపణలని ఆమె స్పష్టం చేశారు. అలాగే కోటేశ్వరావు వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారని జీవిత ఆరోపించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement