రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' చిత్రం చివరి దశకు చేరుకుంటుండగా.. రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్‌లో కనిపించకుండా పోయాయని ప్రచారం జరుగుతుంది.
జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీ చిత్రం 'కై పో చే'కి (Kai Po Che) రీమేక్ అని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రజనీ మొయిదీన్ భాయ్‌గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
'లాల్ సలామ్' చిత్రీకరణ పూర్తయి చివరి దశకు చేరుకుంటుండగా.. సినిమాలో రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్ నుంచి మాయమైనట్లు సమాచారం. ఎంతో కష్టపడి రజనీ మీద చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కడా హార్డ్ డిస్క్‌లలో కనిపించడం లేదట. ఆ దృశ్యాలను వెలికి తీసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి రేసు నుంచి ‘లాల్ సలామ్ ’ సినిమా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
పొంగల్‌కు ఇప్పటికే ప్రకటించినట్లుగా, శివకార్తికేయన్ నటించిన అయాలన్, జయం రవి నటించిన సైరన్ మాత్రమే కోలీవుడ్ విడుదల కానున్నాయి. ‘లాల్ సలాం’లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment