మాజీ ఎమ్మెల్యేలకు అరెస్ట్‌ వారెంట్లు | Arrest Warrant Issued To Former MLAs Gangula Kamalakar And Vijaya Ramana Rao | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యేలకు అరెస్ట్‌ వారెంట్లు

Published Fri, Sep 14 2018 7:38 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Arrest Warrant Issued To Former MLAs Gangula Kamalakar And Vijaya Ramana Rao - Sakshi

విజయ రమణా రావు, గంగుల కమలాకర్

సాక్షి, కరీంనగర్‌ జిల్లా : కరీంనగర్‌ టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావులకు ధర్మాబాద్‌ కోర్టు అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 21న వీరిని కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో కలిసి ఆందోళన చేయడంతో చంద్రబాబుతో సహా 16 మందిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు అప్పటి నుంచి విచారణలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement