
ముంబై: నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసులో నటుడు షీజన్ ఖాన్‌కు మహారాష్ట్ర వసాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు, పాస్‌పోర్టు సమర్పించాలనే షరతుతో అతడ్ని విడుదల చేసింది. శనివారం ఈమేరకు తీర్పునిచ్చింది.
తునీషా శర్మను ఆత్మహత్యకు ఉసిగొల్పాడనే ఆరోపణలతో గతేడాది డిసెంబర్ 25న షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు.
టీవీ సీరియల్స్‌తో పాటు పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తునీషా శర్మ(21) గతేడాది డిసెంబర్ 24న ఆత్మహత్య చేసుకుంది. తాను నటిస్తున్న టీవీ సీరియల్ సెట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఈ ఘటన కలకలం రేపింది.
ఆ మరునాడే తునీషా మాజీ ప్రియుడు షీజన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తునీషా, షీజన్ కొద్దికాలంపాటు రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. అనంతరం కొద్ది రోజులకే తునీషా ఆత్మహత్య చేసుకోవడంతో అతనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
చదవండి: ముగిసిన సీబీఐ కస్టడీ.. సిసోడియా బెయిల్‌పై ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment