టీడీపీ నేతపై గన్ ఎక్కుపెట్టిన సెంట్రీ
- కరీంనగర్ జిల్లా జైలు వద్ద ఘటన
- జిల్లా అధ్యక్షుడిని కలిసేందుకు వెళ్తుండగా వాగ్వాదం
కరీంనగర్ క్రైం: కరీంనగర్ జిల్లా జైలు గేటులోకి వెళ్తున్న చొప్పదండి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిపై డ్యూటీలో ఉన్న సెంట్రీ తుపాకీ ఎక్కు పెట్టాడు. ముందస్తు అనుమతి తీసుకున్నా.. తనను లోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు గన్ ఎక్కుపెట్టి ‘కాల్చి పారేస్తా’నని సెంట్రీ అన్నా డని టీడీపీ నేత మేడిపల్లి సత్యం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చింతకుంట విజయరమ ణారావును మంగళవారం కోర్టు రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. జిల్లా జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం వచ్చారు. జైలులో ఉన్న విజయరమణారావును కలిసేందుకు రేవంత్‌తోపాటు పలువురు నాయకులు ముందుగానే అనుమతి తీసుకుని లోనికి వెళ్లారు.
పార్టీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం కూడా లోనికి వెళ్తుండగా సెంట్రీ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సెంట్రీ తనవద్దనున్న తుపాకీ ఎత్తి కాల్చి వేస్తానని బెదిరించాడు. కార్యకర్తలు, పోలీసులు ఇద్దరిని దూరంగా తీసుకుపోవడంతో వివాదం సద్దుమణిగింది. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. దీనిపై ఇన్చార్జి జైలు సూపరింటెండెంట్ సమ్మయ్య మాట్లాడుతూ... జైలు గేట్ వద్ద లోనికి తోసుకుని వెళ్తుండగా వారిని నియంత్రించే క్రమంలో జరిగిన సంఘటన మాత్రమేనని, దీనిపై ఎలాంటి విచారణ చేయడం లేదని అన్నారు. జరిగిన సంఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
కేసీఆర్ పతనం ప్రారంభమవుతుంది: రేవంత్
తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్కు అండగా నిలిచిన కరీంనగర్ గడ్డ నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమవుతుందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షు డు చింతకుంట విజయరమణారావును బుధవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజలను, రైతులను చులకనగా చూస్తున్నారన్నారు. సమస్యలు పరి ష్కరించాలని ఉద్యమించిన వారిపై పోలీసులను ఉసిగొల్పి అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. ఎండుతున్న పంటలకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయూలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదన్నారు. ఎస్సారెస్పీ నీటి విడుదలపై మాట తప్పిన మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్‌రావులను అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. విజయరమణారావు జైలు నుంచి రావడంతోనే ఎల్లంపల్లి నీటి విడుదలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. పలువురు దళితులపై విద్యుత్ దొంగలుగా ముద్రవేసి జైలుకు పంపించారని రేవంత్‌రెడ్డి చెప్పారు. కరీంనగర్ జైలులో ఉన్న దళితులకు బెరుుల్ తీసుకునే స్తోమత కూడా లేదని, టీడీపీ తరఫున న్యాయవాదులను నియమించి వారికి బెరుుల్ వచ్చేలా చూస్తామని అన్నారు. ఆయన వెంట టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు, పార్టీ జిల్లా ఇన్చార్జి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.