బాలీవుడ్ దర్శక-నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు వారిపై బిహార్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. వివరాలు.. ఎక్తా కపూర్ నిర్మించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రిటైర్ట్ సర్విస్‌మ్యాన్ శంబు కుమార్ 2020లో బీహార్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఆ సిరీస్‌లో జవాన్ల భార్యలను అవమానపరిచారని, వారిని ఉద్దేశిస్తూ ఉన్న పలు సీన్స్ వారి కుటంబాలను కించపరిచే విధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. శంబు కుమార్ ఫిర్యాదు మేరకు ఎక్తాకపూర్, ఆమె తల్లి శోభ కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది.
చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
అంతేకాదు ఈ విషయమై వారు కోర్టులో హాజరు కావాలని కూడా ఆదేశించింది. అయితే సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలు తొలగించినప్పటికి, వారు కోర్టు ఆదేశాలని ధిక్కరించారని, నోటిసులు అందిన ఎక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంబు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యిందని ఆయన వెల్లడించారు. కాగా 2020లో ఎక్తా కపూర్ దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఎక్స్-సీజన్ 2 వెబ్ సిరీస్‌ను తన సొంత ఓటీటీ సంస్థ ఎఎల్‌టీబాలజీ (బాలజీ టెలిఫిలింస్ లిమిటెడ్) వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఆమె తల్లి శోభ కపూర్ కూడా చూసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment