ఎంజీబీ మాల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన కారు పాదచారులపైకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని ఎంజీబీ మాల్ వద్ద అతి వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై వెళుతున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి.