బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం | Young Man Dead Body Koduru Beach Nellore | Sakshi
Sakshi News home page

బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం

Published Thu, Aug 2 2018 10:04 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Young Man Dead Body Koduru Beach Nellore - Sakshi

 మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం

తోటపల్లిగూడూరు( నెల్లూరు): మండలంలోని కోడూరు బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బుధవారం బయటపడింది. ఎవరో చంపి మృతదేహాన్ని ఇసుకలో కప్పిపెట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడూరు బీచ్‌ కుడివైపున, ఏపీ టూరిజం రిసార్ట్స్‌ ఎదురుగా ఉన్న ఇసుక దిబ్బల్లో ఇసుకతో కప్పబడిన ఓ మృతదేహాన్ని బుధవారం స్థానిక మత్స్యకారులు గుర్తించారు. వారి సమాచారంతో నెల్లూరు రూరల్‌ డీఎస్సీ రాఘవరెడ్డి, ఎస్సై శివకృష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మొండం మొత్తం ఇసుకలో కప్పబడి తల మాత్రమే పైకి కనిపిస్తున్న మృతదేహాన్ని పోలీస్‌ సిబ్బంది వెలికితీశారు. సుమారు పది రోజుల క్రితం యువకుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి తల పూర్తిగా కుళ్లిపోయి ఉండగా తల వెనుకభాగాన గట్టి దెబ్బ ఉన్నట్టు గుర్తించారు. యువకుడు బ్లూ జీన్స్‌ ప్యాంట్, నీలం రంగు షర్ట్‌ ధరించి ఉన్నాడు. అలాగే చేతి వేలికి లవ్‌ గుర్తు రింగ్‌ ఉంది. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement