Koduru Beach
-
బీచ్‌లో యువకుడి మృతదేహం లభ్యం
తోటపల్లిగూడూరు( నెల్లూరు): మండలంలోని కోడూరు బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం బుధవారం బయటపడింది. ఎవరో చంపి మృతదేహాన్ని ఇసుకలో కప్పిపెట్టారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడూరు బీచ్ కుడివైపున, ఏపీ టూరిజం రిసార్ట్స్ ఎదురుగా ఉన్న ఇసుక దిబ్బల్లో ఇసుకతో కప్పబడిన ఓ మృతదేహాన్ని బుధవారం స్థానిక మత్స్యకారులు గుర్తించారు. వారి సమాచారంతో నెల్లూరు రూరల్ డీఎస్సీ రాఘవరెడ్డి, ఎస్సై శివకృష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొండం మొత్తం ఇసుకలో కప్పబడి తల మాత్రమే పైకి కనిపిస్తున్న మృతదేహాన్ని పోలీస్ సిబ్బంది వెలికితీశారు. సుమారు పది రోజుల క్రితం యువకుడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వయస్సు సుమారు 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి తల పూర్తిగా కుళ్లిపోయి ఉండగా తల వెనుకభాగాన గట్టి దెబ్బ ఉన్నట్టు గుర్తించారు. యువకుడు బ్లూ జీన్స్ ప్యాంట్, నీలం రంగు షర్ట్ ధరించి ఉన్నాడు. అలాగే చేతి వేలికి లవ్ గుర్తు రింగ్ ఉంది. పోలీసులు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
సాగరతీరంలో పర్యాటకుల కోలాహలం
తోటపల్లిగూడూరు : ప్రముఖ పర్యాటక ప్రాంతం కోడూరు బీచ్ ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం భక్తులతో రద్దీగా ఉండే కోడూరు బీచ్‌కు రొట్టెల పండగ సందర్శకులు కూడా తోడవ్వడంతో మరింత కిక్కిరిసి పోయింది. విద్యార్థులు, యువత తమ తల్లిదండ్రులతో సేద తీరేందుకు సాగరతీరం చెంతకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కోడూరు సాగరతీరంలో పండుగ వాతావరణం నెలకొంది. సందర్శకులు గంటలకొద్ది సముద్రంలో జలకాలాడారు. -
'కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా మార్చుతాం'
నెల్లూరు: కోడూరు బీచ్ ను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోడూరు బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నెరుకూరు-కోడూరు రోడ్డు పనులకు ఆయన శంకు స్థాపన చేశారు. -
బీచ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్ధులు గల్లంతు
నెల్లూరు: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోడూరుబీచ్లో ఈతకు వెళ్లిన ఇద్దరు ఇంటర్ విద్యార్ధులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిద్దరూ నారాయణ కళాశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వీరు చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థులుగా తెలిపారు. గల్లంతైన విద్యార్ధులు లికిత్రెడ్డి, సతీష్ రెడ్డిల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెప్పారు.