సమావేశంలో మాట్లాడుతున్న సురేంద్రరెడ్డి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారతీయ జనతాపార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇతర పార్టీలకు చెందినవారు పార్టీలో చేరవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ 100 మంది చేత బీజేపీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం బీజేపీ, మైనార్టీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్‌కే అబ్దుల్‌రహీం అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఆలిండియా వక్ఫ్‌బోర్డు సభ్యులు, పలువురు జాతీయ మైనార్టీ నాయకులు నగరానికి రానున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తులు, త్రిబుల్‌తలాక్‌పై విస్త్రతంగా సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు వస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని మండల, నగర స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి, ఇప్పటి వరకు 10 వేల మందికి నూతన సభ్యత్వాలు ఇవ్వటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఇన్‌చార్జిలుగా రాష్ట్ర నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, చక్రవర్తిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేఈపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, కాయల మధు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్‌కే అబ్దుల్ రహీం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే చాంద్‌బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment