membership program
-
వామ్మో ! ఇది కొన్న వారికి 14 సంవత్సరాలు పండగే (అడ్వెటోరియల్)
కేవలం సగం కంటే తక్కువ ధరకే నాణ్యతతో కూడిన కొత్త టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాటర్ ప్యూరిఫైర్లు లాప్టాప్ , మొబైల్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనాలని డిస్కౌంట్ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా ? వాటిని కొనడానికి క్రెడిట్ కార్డులు, పే స్లిప్పులు అడిగే సంప్రదాయ వెబ్ సైట్ల నిర్వాకంతో అలసిపోయారా ? అదే సమయానికి మీ స్నేహితులని క్రెడిట్ కార్డ్ అడిగితే ఇవ్వలేదని భాదపడ్డారా , ఇంక చాలు , ఇక పై మీరు భాదపడవలసిన అవసరం లేదు ఇప్పుడు మీకో గుడ్ న్యూస్ ! వావ్ అనిపించే ఆఫర్లతో స్టార్ట్ అప్ కంపెనీ ‘Incovize" మీ ముందుకు వచ్చింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఏర్పాటైన ఇంకోవైజ్, తమ ప్రొడక్టులను నాణ్యతలో రాజీ పడకుండా తయారు చేస్తోంది. ఇక ఆఫర్ల గురించి విన్నవారు incovize membership card ని కొనకుండా incovize.com వెబ్ సైట్ నుంచి బయటకు రావడం అసాధ్యమని అంటున్నారు. అయితే వెబ్ సైట్లో incovize membership ని మొదటిగా కొన్న వెయ్యి మందికి మాత్రమే కంపెనీ ఇచ్చే సూపర్ ఆఫర్లను పొందే అవకాశం లభిస్తుంది. ఆ ఆపర్లేమిటో మీరే చూడండి.. 1. ప్రీమియం మెంబర్ షిప్: రూ. 1,999/- 14 సంవత్సరాల వాలిడిటీ ప్రీమియం మెంబర్షిప్ తీసుకున్న వారికి 2,699 రూపాయల విలువైన 1.8 లీటర్ల ఇంకోవైజ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ పూర్తి ఉచితంగా ఇవ్వబడుతుంది. ఆ ప్రొడక్ట్ పై 5 సంవత్సరాలు వారంటీ ఉండగా, దానికి మరో 5 సంవత్సరాలు కలిపి మొత్తం 10 సంవత్సరాల వారంటీ ఉంటుంది. ఈ మెంబర్షిప్ తీసుకున్న వారు భవిష్యత్ లో ఇంకోవైజ్ ప్రొడక్ట్‌లను ఏవి కొన్నా సరే , ప్రతి వస్తువు పై ఫ్లాట్ 60% అదనపు తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు 10% క్యాష్ బ్యాక్, 5 ఏళ్ల అదనపు వారంటీ, 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ లభిస్తుంది. మొదటి 1000 మందికి మాత్రమే ఈ మెంబర్ షిప్ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ మెంబర్ షిప్ ప్రత్యేకత ఏంటంటే, భవిష్యత్ లో ఈ మెంబెర్షిప్ పై ఏ వస్తువు కొన్న EMI కోసం క్రెడిట్ కార్డు, పాన్ కార్డు, పే స్లిప్పు లాంటివి ఎటువంటివి కూడా అవసరం లేదు, అలాగే మీ మొదటి EMI ని ఐదువ నెల నుండి ప్రారంభించవచ్చు...పాన్ కార్డ్ ని సబ్ మిట్ చేయాలిసిన అవసరం లేకపోవడంతో, మీ పాన్ కార్డ్ లో సిబిల్ స్కోర్ తగ్గిపొద్దేమో అనే భాదే అవసరం లేదు, ఇది చాలా గొప్ప ఆఫర్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .. 2. ఇదే విధంగా ప్రో మెంబర్ షిప్ రూ. 1,850/-ఏడు సంవత్సరంల వాలిడిటి. 3. ప్రైమ్ మెంబర్ షిప్ రూ. 1,699/- మూడు సంవత్సరాల వాలిడిటి తో ఆఫర్లు వున్నాయి. ఇలా మెంబెర్ షిప్ కొన్న వారికి కాంప్లీమెంటరీ గా ఉచిత బహుమతి కింద ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ , ఎలక్ట్రిక్ కెటిల్ ఇంకా ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ ఏదైనా ఒక దాన్ని మెంబెర్షిప్ ప్లాన్ బట్టి ఒక ప్రొడక్ట్ ను ఉచితం గా పొందవచ్చు.భవిష్యత్ ఆఫర్లును కూడా ఉపయోగించుకోవచ్చు , ఉదాహరణకు మెంబర్ షిప్ ద్వారా ఇంకోవైజ్ వెబ్సైట్లో (incovize electronics)ఒక టీవీ లేదా ఏసీ ని కొంటె దాని విలువ రూ. 28,799/- ఉంటే అందులో మీకు అదనంగా 60% డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఒక ఏసీ ని మీరు కేవలం రూ.11,500/- మాత్రమే అన్న మాట , ఇలా 14 సంవత్సరాలు లో మీరు ఏ వస్తువు కొన్న 60% శాతం అదనపు డిస్కౌంట్, అదనపు వారంటి, ఈ యం ఇ సౌకర్యం ఇలా ఖచ్చితమైన ఆఫర్ ను పొందవచ్చు ,ఆఫర్ అదిరింది కదా ! వీటితో పాటు ఇయర్ ఫోన్స్ నుంచి టీవీల వరకు.. మిక్సీల నుంచి వాటర్ ప్యూరిఫైయర్ల వరకు 100కు పైగా ప్రొడక్టులును ఈ మెంబర్ షిప్ పై ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు, ప్రొడక్ట్స్ ఆన్స్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి అందుబాటులోకి రానున్నాయి. వెంటనే ఈ ఆఫర్లను దక్కించుకోండి ఇంకోవైజ్ గురించి.. ఇంకోవైజ్ కంపెనీ 2021లో బెంగళూరు నగరంలో స్టార్ట్అప్ గా ప్రారంభమైంది. 2024 నాటికి మూడు బిలియన్ డాలర్లు విలువైన కంపెనీగానూ, 2036 నాటికి ప్రపంచంలోని ఎలక్ట్రాన్సిక్స్ మార్కెట్లో 5 శాతం షేర్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సరికొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్టులను ముందుకు తీసుకురావడం, నాణ్యతతో కూడిన సేవలను అందించడం, కస్టమర్లకు అందుబాటులోనే త్వరితగతిన సపోర్ట్ అందించి నమ్మకమైన సంస్థగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. 100కు పైగా ప్రొడక్టులను అందుబాటు ధరల్లో, భారతీయులకు అవసరమైన విధంగా తయారు చేసేందుకు ఇంకోవైజ్ నడుం కట్టింది. బడ్జెట్ ధరల్లోనే లగ్జరీ వస్తువులను మూడు రకాల incovize మెంబర్షిప్ కార్డుల ద్వారా అందిచేందుకు సిద్ధమైంది. కొన్న ప్రతి ప్రొడక్టును ఉచితంగా ఇంటి వద్దకు కంపెనీయే చేరుస్తుంది. ఇప్పటికే మెంబర్షిప్ సంఖ్య లక్ష్యం వైపు దాటిపోతున్న నేపథ్యంలో ఆఫర్లను మిస్సవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడే కార్డును కొనుగోలు చేయండి. లైఫ్ టైం డబ్బును ఆదా చేసుకోండి (అడ్వెటోరియల్) -
మోడీ పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకున్నారు
నందనవనం (సింగరాయకొండ): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరు కున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జరుగుమల్లి మండలం నందనవనం గ్రామ ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ పీఎం జీవనజ్యోతి యోజన అనే పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు దానికి పేరు మార్చి చంద్రన్న బీమా అని పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన ఎన్నో ప్రజా ప్రయోజన పథకాలకు తన పేరు పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో పేదలకు ఉపాధి కల్పించడమే కాక, సిమెంటు రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, శ్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మిస్తే చంద్రబాబు మాత్రం గత ఐదేళ్లలో మోడీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం చేశారని ఆరోపించారు. సమాజంలో ప్రతి పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే బీజేపీ లక్ష్యమని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు లో పాల్గొని పార్టీ రాష్ట్రంలో బలపడటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు సింగరాయకొండ మండలంలోని పాతసింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మీనరసింహాస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.వి. కృష్ణారెడ్డి, దారా సాంబయ్య, రమణారావు, కనుమల రాఘవులు, ఇత్తడి అక్కయ్య, కొణిజేటి మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరైనా బీజేపీలో చేరొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారతీయ జనతాపార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇతర పార్టీలకు చెందినవారు పార్టీలో చేరవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్.సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ 100 మంది చేత బీజేపీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం బీజేపీ, మైనార్టీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్కే అబ్దుల్‌రహీం అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఆలిండియా వక్ఫ్‌బోర్డు సభ్యులు, పలువురు జాతీయ మైనార్టీ నాయకులు నగరానికి రానున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తులు, త్రిబుల్‌తలాక్‌పై విస్త్రతంగా సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు వస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని మండల, నగర స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి, ఇప్పటి వరకు 10 వేల మందికి నూతన సభ్యత్వాలు ఇవ్వటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఇన్చార్జిలుగా రాష్ట్ర నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, చక్రవర్తిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేఈపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, కాయల మధు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్కే అబ్దుల్ రహీం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే చాంద్‌బాషా పాల్గొన్నారు. -
బీజేపీకి పెద్ద మొత్తంలో ఫండ్ ఎలా వస్తోంది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జీహెచ్ఎంసీకి ముందుస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత ఎన్నికల్లో తాము 99 స్థానాల్లో గెలుపొందామని, ఈసారి 106 సీట్లలో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని గడ్డి అన్నారం, యాకత్‌పుర పరిధిలోని వినయ్ నగర్ కమిటీ హాల్, బహదూర్ పుర ప్రాంతాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉచితంగా పార్టీ సభ్యుత్వాన్ని అందిస్తున్న బీజేపీకి పెద్ద మొత్తంలో పార్టీ ఫండ్ ఎలా వస్తోందని ప్రశ్నించారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షడు అమిత్ షా ఇటీవల తెలంగాణ వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వ్యాపారవేత్తలచేత బలవంతంగా సభ్యుత్వ కార్యక్రమాలు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలు చేస్తోన్న కార్యక్రమాలకు ప్రజలంతా ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం కోసం ముందుకు వస్తున్నారని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసేవారికి సముచిత గుర్తింపు లభిస్తుందని మంత్రి అన్నారు. -
నటించొద్దు.. పోరాటం చేయండి: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిందేనని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఉద్ఘాటించారు. బీజేపీకి ప్రజాదరణ అనూహ్యంగా పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. ఇదే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరిం చుకుని శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శంషాబాద్‌లోని కేఎల్‌సీసీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అమిత్‌షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిం చారు. ‘ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చా. రాష్ట్ర ప్రజలు మోదీ నాయకత్వానికి మద్దతు పలికారు. ఇక్కడ 20శాతానికిపైగా ఓట్లు రావడంతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీ గెలుపు అవసరం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యం. ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చేస్తున్నందునే ప్రజలంతా మూకుమ్మడిగా మోదీకి మద్దతు ఇచ్చారు’అని అమిత్ షా అన్నారు. పటేల్ ఆశయాలతోనే.. ‘నిజాం చేతుల్లోనుంచి తెలంగాణకు విముక్తి కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. తెలంగాణ నిజమైన అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోయింది. అసలైన ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటుంది. విజయాలకు పొంగిపోదు. పరాజయాలకు కుంగిపోదు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతుండడాన్ని ప్రతిపక్ష పార్టీలు తట్టుకోవడం లేదు. కార్యకర్తలే మన పార్టీకి బలం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రతి ఇంటికీ ఎల్పీజీ సిలిండర్ ఇచ్చాం. పేదలందరికీ కూడు, గూడు కల్పించడమే మాలక్ష్యం’అని షా పేర్కొన్నారు. కేసీఆర్‌ది హింసాత్మక పాలన: లక్ష్మణ్ తెలంగాణలో హింసాత్మక పాలన కొనసాగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పొత్తుల్లేకుండా ఒంటరిగా బరిలోదిగి 4 పార్లమెంటు స్థానాల్లో విజయఢంకా మోగించామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనన్నారు. టీఆర్ఎస్ నిరంకుశపాలనను బలంగా ఎదుర్కొంటామన్నారు. సభ్యత్వ నమోదును పెద్ద సంఖ్యలో చేపట్టి ప్రతి పోలింగ్‌బూతుకు ఒక సైనిక దళాన్ని సిద్దం చేస్తామని లక్ష్మణ్ అన్నారు. బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదెండ్ల ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కరరావు శనివారం బీజేపీలో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మెహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, సినీ నిర్మాత బెల్లంకొండ రమేశ్, రామగుండం డిప్యూటీ మేయర్ సత్యప్రసాద్, టీడీపీ నాయకులు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్, వెంకటేశ్వరరావు, మాజీ ఐఏఎస్ అధికారి సి.చంద్రవదన్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. వీరందరికీ అమిత్‌షా బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు లోగోనూ, సభ్యత్వ నమోదు మిస్డ్‌కాల్ నంబర్‌ను అమిత్‌షా ఆవిష్కరించారు. కొత్తగా సభ్యత్వం తీసుకున్న పలువురికి ఆయన సభ్యత్వ నమోదు పత్రాలను అందించారు. అంతకుముందు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు సీఐఎస్ఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ అధికారులతో షా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అమిత్ షా వెంట కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు. గిరిజన మహిళకు సభ్యత్వంతో షురూ! మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లిలోని రంగనాయకుల కాలనీకి అమిత్‌షా విచ్చేశారు. స్థానికంగా ఉండే గిరిజన మహిళ సోని ఇంటికి చేరుకుని ఆమెకు బీజేపీ సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి.. జొన్నరొట్టె, ఉప్మా తిన్నారు. అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మొక్క నాటారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో ముచ్చటించిన అనంతరం అమిత్ షా.. దేవేందర్‌నగర్ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మరో మొక్కను నాటారు. అక్కడినుంచి శంషాబాద్ కేఎల్‌సీసీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభకు తరలి వెళ్లాడు. అమిత్‌షా వెంట పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మహేశ్వరం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు ఉన్నారు. నటించొద్దు.. వీధి పోరాటాలు చేయండి తెలంగాణలో బీజేపీని బలపర్చేందుకు ప్రజాసమస్యలపై వీధి పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏదో చేస్తున్నట్లు నటించొద్దని హెచ్చరిస్తూనే.. పశ్చిమబెంగాల్లో పార్టీ బలపడిన తీరును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శనివారం రాత్రి నగరంలోని ఓ హోటల్లో పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో 40 జిల్లాల్లో తను రాత్రిబస చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నికల కోసం ఆలోచించకుండా, 51% ఓటు బ్యాంకు లక్ష్యంగా పనిచేయాలన్నారు. కేసీఆర్‌తో ఎలాంటి దోస్తీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్న అవినీతిపై కేసులు వేయాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు నెలకోసారి రాష్ట్రానికి వస్తానన్నారు. 19% ఓట్లు వచ్చిన ప్రతి రాష్ట్రంలోనూ తర్వాతి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో గెలవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీలో చేరిన నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. దానిలో భాగంగా శనివారం (జూలై 6) దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళ సోని బీజేపీ సభ్యురాలిగా అమిత్‌షా సమక్షంలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలాఉండగా... చాన్నాళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్ షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చులకనగా చూడొద్దు... బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. ‘బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. పార్టీలో ఎన్నో గెలుపోటములు చూశాం. మమ్మల్ని చులకనగా చూసిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదు. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే మా లక్ష్యం. పేదలు మహిళలకోసం బడ్జెట్లో ఎన్నొ పథకాలు ప్రకటించాం. 2022 కల్లా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాం’అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన అనంతరం అమిత్‌షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. -
‘ఏపీలో మంత్రి పదవులపై మాట్లాడాలి..’
చిక్కడపల్లి: వేరే పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారంటున్నా బుడ్డర్ఖాన్ రేవంత్‌రెడ్డి ఏపీలో వైఎస్సార్సీపీకి చెందిన నలుగురి ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవులు ఇచ్చింది ఈ విషయంపై సమాధానం చెప్పాలని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గాంధీనగర్ వై జంక్షన్ వద్ద టీఆర్ఎస్ నాయకులు బీఎన్ శ్రీనివాస్‌రావుయాదవ్, పాశం రవి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె.లక్ష్మణ్ నోరెత్తితే కేసీఆర్, టీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా నగంరంలోని బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఒక్క బీజేపీ కార్పొరేటర్‌ను గెలిపించుకోలేదని ఇక మీకు నోరు ఎక్కడిదని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 9 లక్షలు ఖర్చు అయితే లక్షన్నర చొప్పున ఇస్తున్న బీజేపీ మేమిచ్చాం అని చెప్పుకోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో గెలిచామని చెప్పుకుంటున్నా బీజేపీ వారిపై ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే ఆరోపణలు ఉన్నాయని ఆ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటాదని చెప్పారు. రాష్ట్రంలో గతంలో రూ. 50 లక్షల సభ్యత్వ నమోదు జరుగగా ఈ సారి ఇప్పటికే 75 లక్షల సభ్యత్వం నమోదు జరిగిన్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల బీమా ఉంటుందని తెలిపారు. -
‘పంచాయతీ’లోనే సభ్యత్వ నమోదు
జేగురుపాడులో టీడీపీ నేతల బరితెగింపు నేతల ఆగడంపై ఉన్నతాధికారులకు స్థానికుల ఫిర్యాదు కడియం : వంద రూపాయలు, ఆధార్, రేష¯ŒS కార్డు కాపీలు ఇస్తే బీమా సదుపాయం కల్పిస్తామంటూ గ్రామాల్లో ప్రచారం చేసి టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, న్యాయవాది యాదల సతీష్‌చంద్రస్టాలి¯ŒS ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కడియం మండలం జేగురుపాడులో టీడీపీ సభ్యత్వ నమోదును పంచాయతీ కార్యాలయంలో చేపట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో స్థానికులతో కలిసి స్టాలి¯ŒS పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఒక పార్టీ కార్యక్రమానికి పంచాయతీని వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలి¯ŒS మాట్లాడుతూ బీమా కల్పిస్తామని గ్రామంలో టాంటాం వేయించి, అక్కడ వారికి టీడీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నారన్నారు. అన్ని కులాలు, వర్గాలు, పార్టీలకు వేదికగా ఉండాల్సిన పంచాయతీ కార్యాలయాన్ని టీడీపీ సొంత కార్యాలయంగా మారుస్తోందన్నారు. గ్రామంలో తప్పుడు ప్రచారం చేసి సభ్యత్వాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పంచాయతీని పార్టీ కార్యాలయంగా మార్చి సొంత పనులకు వినియోగించడంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. స్థానికులు ఆందోళనకు సిద్దం కావడంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను పంచాయతీ కార్యాలయం నుంచి బైటకు తరలించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్టాలి¯ŒS చెప్పారు. ఆందోళనలో ఆకుల సుధాకర్, మద్దుకూరి బాలు, మద్దుకూరి పుల్లయ్య, వర్షాల నాని, కర్రి సంతోష్, పోలిసెట్టి బాలు తదితరులు పాల్గొన్నారు. -
గులాబీ పండుగ
తెలంగాణ రాష్ర్ట సమితిలో సంస్థాగత సంరంభం మొదలైంది. సభ్యత్వ నమోదు సందర్భంగా గ్రామస్థాయి నుంచి అన్ని కమిటీలను రద్దు చేసిన ఆ పార్టీ నాయకత్వం కొత్త కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు సభ్యత్వ సేకరణ చేశాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రతి నియోకవర్గంలో ఐదు వేల క్రియాశీల, 25 వేల సాధారణ సభ్యుల చొప్పున 2.70 లక్షలకు తగ్గకుండా సభ్యత్వాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా అది 4.52 లక్షలకు చేరింది. పోటాపోటీగా సాగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులు సర్వశక్తులొడ్డారు. వచ్చే నెల 24న రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉండగా, ఈలోగానే గ్రామ, మండల, జిల్లా కమిటీల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం కామారెడ్డిలో జిల్లాస్థా యి విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా ఏర్పడే కమిటీలలో చోటు కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు. ఉత్సాహంగా సభ్యత్వ సేకరణ టీఆర్ఎస్ పార్టీ రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని కొంపల్లిలో నిర్వహించిన సమావేశం తర్వాత అన్ని కమిటీలు రద్దయ్యాయి. ఏప్రిల్ 24వ తేదీలోగా అన్ని స్థాయిలలో కొత్త కమిటీలను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో పార్టీ అధినే త కమిటీలను రద్దు చేస్తున్నట్లు అదేరోజు ప్రకటించారు. వాస్తవానికి జిల్లాలో జనవరి 28 నుం చి సభ్య త్వ సేకరణ ప్రారంభం కావాల్సి ఉం డగా ఫిబ్రవరి నాలుగున ప్రా రంభించారు. జి ల్లాలోని తొమ్మి ది నియోజకవర్గాల లో ఒకేసారి సభ్యత్వ న మోదును ప్రారం భించగా, కొత్త కమిటీలకు ప్రాతిని ధ్యం వహించే ఉద్ధేశ్యంతో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహం చూపారు. ఫిబ్రవరి 24న ముగించాలని భావించినా, వారం రోజులు పొడిగించారు. అనుకున్నట్లుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయితే ఈ నెల ఒకటి నుంచి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఉంటుందనుకున్నారు. అయితే, శాసనసభ సమావేశాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభం కారణంగా సంస్థాగత ఎన్నికలు ఈ నెలాఖరుకు మారాయి. సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా కరీంనగర్ జిల్లాకు చెందిన రూప్‌సింగ్‌ను ఇదివరకే నియమిం చిన పార్టీ అధిష్టానం ఈ నెల 26 నుంచి ఎన్నికల ప్రక్రియను కొనసాగించనుంది. ఇందుకోసం కామారెడ్డిలో జిల్లాస్థాయి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డిసహా జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కావాలని పార్టీ పిలుపునిచ్చింది. 26 నుంచి కొత్త కమిటీల ప్రక్రియ వచ్చే నెల 16లోగా గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఈనెల 26 నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు మంగళవారం మధ్యాహ్నం కామారెడ్డిలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని టీఆర్ఎస్ జిల్లా పరిశీల కులకు రూప్సింగ్, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డిలో ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇదిలా వుండగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకా రం మార్చి ఒకటో తేదీ నుంచి 10 వరకు గ్రామ కమిటీల ఎన్నికలు, 11 నుంచి 20 వరకు మండల, పురపాలిక కమిటీ ల ఎన్నికలు జరిగితే, ఏప్రిల్ మొదటి వారంలో జిల్లా కమిటీతోపాటు, అనుబంధ కమిటీల ప్రక్రియ పూర్తి అవుతుందని భావించారు. తేదీలలో కొద్దిపాటి మార్పులు చో టు చేసుకోవడంతో ఈ నెల 26 నుంచి సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుడుతున్నారు. వచ్చే నెల 2 వరకు గ్రామకమిటీలు జరుగుతాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించా యి. అదే విధంగా ఏప్రిల్ 6 నుంచి 12 వరకు మండల కమిటీలు, 13 నుంచి 16 వరకు జిల్లా కమిటీ, అనుబంధ సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నారు. -
'పార్టీ సభ్యత్వంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి'
కరీంనగర్ : పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని ఆ జిల్లా జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకురాలు తుల ఉమా జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాలోని కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి... పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేసింది. అందులోభాగంగా వివిధ జిల్లాలో ఇప్పటికే ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతుంది.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
బీజేపీ బలోపేతానికి కృషి : పురందేశ్వరి
అనంతపురం: ఆంద్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ నేత పురందేశ్వరి అన్నారు. సోమవారం హిందూపూరంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ( హిందూపురం)