- జేగురుపాడులో టీడీపీ నేతల బరితెగింపు
- నేతల ఆగడంపై ఉన్నతాధికారులకు స్థానికుల ఫిర్యాదు
‘పంచాయతీ’లోనే సభ్యత్వ నమోదు
Published Sun, Dec 11 2016 11:21 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
కడియం :
వంద రూపాయలు, ఆధార్, రేష¯ŒS కార్డు కాపీలు ఇస్తే బీమా సదుపాయం కల్పిస్తామంటూ గ్రామాల్లో ప్రచారం చేసి టీడీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు, న్యాయవాది యాదల సతీష్‌చంద్రస్టాలి¯ŒS ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కడియం మండలం జేగురుపాడులో టీడీపీ సభ్యత్వ నమోదును పంచాయతీ కార్యాలయంలో చేపట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో స్థానికులతో కలిసి స్టాలి¯ŒS పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకుని ఒక పార్టీ కార్యక్రమానికి పంచాయతీని వినియోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాలి¯ŒS మాట్లాడుతూ బీమా కల్పిస్తామని గ్రామంలో టాంటాం వేయించి, అక్కడ వారికి టీడీపీ సభ్యత్వ నమోదు చేస్తున్నారన్నారు. అన్ని కులాలు, వర్గాలు, పార్టీలకు వేదికగా ఉండాల్సిన పంచాయతీ కార్యాలయాన్ని టీడీపీ సొంత కార్యాలయంగా మారుస్తోందన్నారు. గ్రామంలో తప్పుడు ప్రచారం చేసి సభ్యత్వాల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. పంచాయతీని పార్టీ కార్యాలయంగా మార్చి సొంత పనులకు వినియోగించడంపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. స్థానికులు ఆందోళనకు సిద్దం కావడంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను పంచాయతీ కార్యాలయం నుంచి బైటకు తరలించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్టాలి¯ŒS చెప్పారు. ఆందోళనలో ఆకుల సుధాకర్, మద్దుకూరి బాలు, మద్దుకూరి పుల్లయ్య, వర్షాల నాని, కర్రి సంతోష్, పోలిసెట్టి బాలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement