
బీజేపీ బలోపేతానికి కృషి : పురందేశ్వరి
అనంతపురం: ఆంద్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ నేత పురందేశ్వరి అన్నారు. సోమవారం హిందూపూరంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణు వర్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
( హిందూపురం)