
బిడ్డ మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు
దాంపత్య బంధాలు నానాటికి బలహీనపడుతున్నాయి. అక్రమ బంధాలు బలపడి బరితెగిస్తున్నాయి. వీడలేక..విడిపోలేక.. వదిలించుకునే క్రమంలో ప్రతీకారేచ్చకు తెగబడుతున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు వంటి కిరాతకాలకు దారితీస్తున్నాయి. ఈ తరహా దారుణాలు ఇటీవల కాలంలో జిల్లా మితిమీరాయి.
నెల్లూరు (క్రైమ్): ‘మాయమైపోతున్నడమ్మా మనిషిన్నవాడూ.. మచ్చుకైనా కానరాడే మానవత్వమున్నవాడు..’ అని ఒక సినీ కవి రచించిన గేయం జిల్లాలో అక్షరసత్యంగా మారింది. జిల్లాలో జరుగుతున్న ఘటనలు చూస్తే మానవత్వం మరుగున పడి కిరాతకం పైచేయి సాధిస్తున్నట్లుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో హత్యలు, హత్యాయత్నం, నిత్యకృత్యంగా మారాయి. మహిళలకు, చిన్నారులకు ఇంటా బయట రక్షణ కొరవడింది. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబ సభ్యులే ఘాతుకాలకు పాల్పడుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23న వివాహేతర సంబంధం నేపథ్యంలో సర్వేపల్లి కాలువకట్ట రాజీవ్‌గాంధీకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం ప్రియురాలి కుమారుడు చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు.
- ఫిబ్రవరి 28న రంగనాయకులపేట ఉప్పరపాళెంలో దుర్గ అనే మహిళపై ఆమె ప్రియుడు కిశోర్ హత్యాయత్నం
- ఏప్రిల్ 4న పొదలకూరు మండలం పొట్టేళ్ల కాలువ వద్ద వివాహేతర సంబంధం వద్దన్నాడని ఓబుల్‌రెడ్డిపై ఇద్దరు యాసిడ్ దాడి చేశారు.
- మే 3న వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వేధింపులు తాళలేక బీవీనగర్‌కు చెందిన రవితేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- జూలై 9న ప్రియురాలిని కలిసేందుకు అడ్డుగా ఉన్నాడని ఆమె భర్త శ్రీధర్‌పై ఆటోడ్రైవర్ చిట్టిబాబు హత్యాయత్నం చేశాడు.
- జూలై 4న ముత్తుకూరు మండలం పంటపాళెం పంచాయతీ కోళ్లమిట్టలో తన భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో ఉండటాన్ని చూïసి జీర్ణించుకోలేని భర్త హరిబాబు ఇంటికి నిప్పం టించాడు. దీంతో అతని భార్య, ప్రియుడు
సజీవదహనమయ్యారు.
- ∙జూలై 11న వివాహేతర సంబంధం నేపథ్యంలో శివాజీకాలనీకి చెందిన సిసింద్రీ ఆత్మహత్య చేసుకున్నాడు.
- ∙తాజాగా కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన రత్తమ్మ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతను గత కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉండటం తో జీర్ణించుకోలేక ఆమె ప్రియుడి నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసి గోనె సంచిలో పెట్టి తన ఇంట్లోనే దాచి పెట్టింది.
- జీవితాలు నాశనం చేసుకుంటున్నారు
వివాహేతర సంబంధాలతో జీవితాలు నాశ నం చేసుకుంటున్నారు. తాళి కట్టి వివాహం చేసుకున్న భార్యను మోసం చేయడం, భర్త కళ్లు గప్పి తప్పుడు ఆలోచనలతో పెడదారి పట్టడం మనల్ని మనం మోసం చేసుకోడమే అవుతుంది.
పి. శ్రీధర్, మహిళా డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment