
బీద మస్తాన్‌రావు
సాక్షి, నెల్లూరు : ఐటీ దాడులతో నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ తగిలింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, ఆయన సోదరుడు మస్తాన్ రావు కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలోని బీఎంఆర్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డులు, కంప్యూటర్ డేటాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో రొయ్యల వ్యాపార లావాదేవీలపై బీద సోదరులను ఆరా తీసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment