టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
టీడీపీ బలోపేతానికి కృషి చేయండి
Published Thu, Oct 27 2016 11:06 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(వేదాయపాళెం): టీడీపీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పేర్కొన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన నెల్లూరు నగర, సర్వేపల్లి నియోజకవర్గాల పార్టీ సర్వసభ్య సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జరిగే జన చైతన్యయాత్రలు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియను నవంబర్ ఐదో తేదీలోపు పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రతి కార్యకర్తా, నాయకులు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని టీడీపీ నాయకులు తిప్పికొట్టాలని కోరారు. పార్టీ పరిశీలకులు నరసింహయ్య, నాయకులు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, రమేష్‌రెడ్డి, మేయర్ అబ్దుల్ అజీజ్, కిలారి వెంకటస్వామినాయుడు, చాట్ల నరసింహరావు, దేవరాల సుబ్రహ్మణ్యం, ఆనం జయకుమార్‌రెడ్డి, శివప్రసాద్, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement