beeda mastan rao
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నూతన రాజ్యసభ సభ్యులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. బీద మస్తాన్‌రావు, ఆర్ కృష్ణయ్య, ఎస్.నిరంజన్‌రెడ్డి నూతన ఎంపీలుగా రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్నారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (ఏపీ: రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్సార్సీపీ కైవసం) -
సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బీద మస్తాన్‌రావు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్‌రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపిక చేసినందకు మస్తాన్‌రావు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీద మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. నన్ను, ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయడంలోనే ఆయన నిబద్ధత కనిపిస్తోంది. టీడీపీలో 30 ఏళ్లు ఉన్నా. బీసీలను పక్కన కూర్చోబెట్టుకోవడం తప్ప వారికి చేసిందేమీ లేదు. సీఎం జగన్ చేతల్లో చూపుతున్నారు. బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ఎన్నో చేశారు. మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యలు ఇలా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. చదవండి: (ఏపీలో వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం) -
సామాజిక మహావిప్లవంలో ‘పెద్ద’ అడుగు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆవిష్కృతమైన సరికొత్త సామాజిక మహావిప్లవంలో మరో ముందడుగు పడింది. రాష్ట్రం నుంచి 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 2 అంటే 50 శాతం స్థానాల్లో బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు(యాదవ)లను వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా సీఎం వైఎస్ జగన్ ఖరారు చేశారు. ‘బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. దేశానికి బ్యాక్ బోన్ క్లాస్’ అని 2019 ఫిబ్రవరి 18న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో స్పష్టం చేసిన సీఎం జగన్ మరోసారి ఆచరించి చూపారని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతికి ఉమ్మడి ఏపీలో, రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేపట్టిన కృష్ణయ్య, విద్యావంతుడైన బీద మస్తాన్‌రావులను రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గాల వాణిని పార్లమెంట్లో బలంగా వినిపించి సమస్యలు పరిష్కరించాలన్నది సీఎం లక్ష్యమని విశ్లేషిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా.. రెండేళ్ల క్రితం నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు సీట్లను బీసీలైన పిల్లి సుభాష్ చంద్రబోస్ (శెట్టిబలిజ), మోపిదేవి వెంకటరమణ(మత్స్యకార)లకు సీఎం జగన్ కేటాయించి పెద్దల సభలో అవకాశం కల్పించారు. మూడేళ్లలో ఏపీ నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాల్లో సగం అంటే 4 స్థానాలను బీసీ వర్గాలకే కేటాయించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ 50% రాజ్యసభ పదవులను బీసీలకు ఇచ్చిన దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. చట్టసభల్లో బీసీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలని బీసీ బిల్లును ప్రైవేట్ బిల్లుగా రాజ్యసభలో వైఎస్సార్పీపీ నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా ప్రవేశపెట్టడం, తాజాగా సగం సీట్లను వారికే కేటాయించడం బీసీల అభ్యున్నతిపై సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోందని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సాధికారతే లక్ష్యంగా.. ► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 2019 ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు.. 151 శాసనసభ స్థానాలు (86.29 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో(88 శాతం) వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని సాధించింది. మే 30, 2019న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ► జూన్ 8, 2019న తొలిసారిగా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో 14 పదవులు (56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయించి సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఓసీ వర్గాలకు 11 పదవులు(44%) ఇచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ స్థాయిలో మంత్రివర్గంలో స్థానం కల్పించిన దాఖలాలు లేవు. ► ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు (80%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అవకాశం కల్పించారు. ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోంమంత్రిగా అవకాశమిచ్చారు. దేశ చరిత్రలో రాష్ట్ర హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం అదే ప్రథమం. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా చొరవ తీసుకున్నారు. మండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజు, మైనార్టీ మహిళ జకియా ఖానంలకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. రాష్ట్ర చరిత్రలో మండలి ఛైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళను నియమించడం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అందులో బీసీ, మైనార్టీలకు 11 పదవులు ఇచ్చారు. మాటల్లో కాదు.. చేతల్లో పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం ఇస్తే ద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అట్టడుగు వర్గాలకు చేరతాయని, ఇది ఆయా వర్గాల అభ్యున్నతి, పేదరిక నిర్మూలన, సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారతకు బాటలు వేస్తుందన్నది సీఎం జగన్ విశ్వాసం. ► మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులు ఉంటే 18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారు. ► పరిషత్ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. జడ్పీ చైర్పర్సన్ పదవుల్లో తొమ్మిది (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 67% పదవులను కేటాయించారు. ► 13 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 7 చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మేయర్ పదవుల్లో 92% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్సీపీ సొంతం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 % ఇచ్చారు. ► నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సర్కారే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం వైఎస్ జగన్ సర్కారే. ► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60%పదవులు ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% పదవులు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58% డైరెక్టర్ పదవులు ఇచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, ఒక ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. -
వైఎస్సార్సీపీలోకి బీద మస్తాన్‌రావు
సాక్షి, అమరావతి: టీడీపీని వీడిన ఆ పార్టీ సీనియర్ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి వైఎస్సార్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీద మస్తాన్‌రావుతోపాటు ఆయన కుమారుడు మనోజ్, అల్లుడు మహితేజ, కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం కూడా పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం 80 శాతానికిపైగా హామీలను నెరవేర్చారు: బీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే 80 శాతానికిపైగా ఎన్నికల హామీలను నెరవేర్చారని బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి విధానాలు నచ్చి బేషరతుగా పార్టీలో చేరానని, తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయంగా, వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరన్నారు. పార్టీలకు అతీతంగా తన ప్రాంత అభివృద్ధికి కృషి చేశానని చెప్పారు. వైఎస్సార్సీపీ సిద్ధాంతాల ప్రకారం, సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా అందరితో కలిసి పని చేస్తానన్నారు. నెల్లూరులో టీడీపీ ఖాళీ: మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు జిల్లాలో టీడీపీ ఇక ఖాళీ అయినట్లేనని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైఎస్సార్సీపీ పట్ల అంతా ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు. టీడీపీకి చెందిన మరికొందరు ముఖ్యనేతలు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ఆయన అలా ఎందుకు మాట్లాడారో తనకు తెలియదని, బహుశా గత ప్రభుత్వం గురించి మాట్లాడి ఉండవచ్చన్నారు. బీసీలకు పెద్దపీట: విజయసాయిరెడ్డి తమ పార్టీ మరో 25 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు అన్ని రకాలుగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు, చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్సీపీకే దక్కిందన్నారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన బీద మస్తాన్‌రావు
సాక్షి, తాడేపల్లి : నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయన్నారు. అనతి కాలంలోనే 80 శాతంపైగా ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఎలక్షన్ మ్యానిఫెస్టోను వైఎస్సార్ సీపీ భగవద్గీత, బైబుల్, ఖురాన్‌గా భావిస్తోందని అన్నారు. తనకు రాజకీయంగా ఎవరితోనూ వ్యక్తిగత విబేధాలు లేవని స్పష్టం చేశారు. నెల్లూరులో టీడీపీకి భారీ షాక్ కాగా బీద మస్తాన్‌రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్‌రావు ఆ పార్టీని వీడారు. -
ఆగని బీద బ్రదర్స్ దందా..
సాక్షి, కావలి(కర్నూలు) : అధికారం అండతో బీద సోదరులు ప్రారంభించిన గ్రావెల్ దందాను ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. సొంత అవసరాలకు సామాన్యులు ట్రక్కు గ్రావెల్ తరలిస్తుంటే నానా హంగామా చేసే అధికార యంత్రాంగం బీద సోదరులు నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత మైనింగ్ శాఖాధికారులు మౌనంగా ఉన్నారు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న బీద సోదరుల గ్రావెల్ దందాపై దృష్టి సారించకపోవడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నిత్యం వందల టిప్పర్లతో వెయ్యి ట్రిప్పుల గ్రావెల్ రవాణా చేస్తున్నారు. ఏడాదిన్నరగా 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. ఒప్పందాల ప్రకారం ఇంకా 15 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ రవాణా చేయాల్సి ఉంది. బీద బద్రర్స్ గ్రావెల్ దందాతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో చిల్లి పడింది. గ్రావెల్ దందా ఒక ఎత్తైతే.. గ్రావెల్ తవ్వకాలు సాగించిన ప్రదేశంలో పెద్ద ఎత్తున ఇసుక తరలించి డంప్‌లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం సాగిస్తున్నారు. ఇందు కోసం గ్రావెల్ గోతుల్లో బోర్లు కూడా వేసుకుని, అన్ని వసతులు సిద్ధం చేసుకున్నారు. మొన్నటి వరకు టీడీపీలో కీలక నేతలుగా చెలామణి అయిన సోదరులు సొంత మండలాన్ని కేంద్రంగా చేసుకుని గ్రావెల్ దందాకు తెర తీశారు. అధికారం అండతో నిబంధనలకు విరుద్ధంగా బీద సోదరులు తమ బినామీల పేర్లతో గ్రావెల్ తవ్వకాల కోసం కొద్ది మొత్తంలో భూములను రెవెన్యూ అధికారులను ప్రలోభ పెట్టి లీజుకు తీసుకున్నారు. అయితే సుమారు 170 ఎకరాలను ఆక్రమించారు. మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం ఆరడుగుల మేర గ్రావెల్ తవ్వాల్సి ఉండగా, ఇప్పటికే వంద ఎకరాలకు పైబడి 10 నుంచి 17 అడుగుల మేర లోతులో తవ్వేశారు. సుమారు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించారు. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వ ఖజానాకు వందల రూ.కోట్ల సీనరైజ్ ఎగ్గొట్టి యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. అల్లూరు మండలం నార్త్ ఆములూరులో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏడాదిన్నర నుంచి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్ర, బీద గిరిధర్ సౌజన్యంతో కొనసాగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. గ్రామంలోని సర్వే నంబర్ 349/5, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15, సర్వే నంబర్ 351/3, 4, సర్వే నంబర్ 350/1, 2, 3, 4, 5, 6, 7, 348/14, 329/1 తదితర సర్వే నంబర్లలో సుమారు 100 ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాణ్యమైన గ్రావెల్ ఇక్కడే జిల్లాలోని బిట్రగుంట–గూడూరుల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులను శ్రీనివాస ఇడిఫైస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్ఈపీఎల్) చేస్తోంది. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో గ్రావెల్‌తో నేలను చదును చేయడం అత్యంత కీలకమైన పని. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే రైలు పట్టాలు బిగిస్తారు. అయితే నేలను చదును చేయడానికి అవసరమైన గ్రావెల్ నాణ్యమైనది, జిగురు ఎక్కువ శాతం ఉండేది అవసరం. ఈ లక్షణాలు కలిగిన గ్రావెల్ అల్లూరు మండలం నార్త్ ఆములూరులోని ప్రభుత్వ భూముల్లో ఉంది. ఏడాదిన్నర క్రితం ఈ పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చిన నిర్మాణ సంస్థ అధికార పార్టీలో చక్రం తిప్పుతున్న బీద సోదరులను ఆశ్రయించింది. కోట్లాది రూపాయలు చేతులు మారడంతో గ్రావెల్ తవ్వకాలకు పచ్చ జెండా ఊపారు. దీంతో బిట్రగుంట నుంచి గూడూరు వరకు ఇక్కడ నుంచి గ్రావెల్‌ను మూడో లైన్‌కు నిర్మాణానికి తరలిస్తున్నారు. 50 వేల క్యూబిక్ మీటర్ల వరకే అనుమతి అయితే బీద సోదరులు వివిధ అవసరాల కోసం తమ బినామీల పేర్లతో 110 ఎకరాలను లీజుకు తీసుకున్నారు. గ్రావెల్ తవ్వకాల కోసం ఇక్కడ పది.. పదిహేను ఎకరాల విస్తీర్ణంలో 50 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ వంద ఎకరాల్లో ఎంత అవసరమో అంత గ్రావెల్ యథేచ్ఛగా తవ్వకాలు చేసుకుని తరలించుకోవచ్చని నిర్మాణ సంస్థకు అప్పగించారు. వాస్తవానికి 25 లక్షలు క్యూబిక్ మీటర్ల గ్రావెల్ నిర్మాణ సంస్థకు అవసరం కాగా, ఇప్పటి వరకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. 100 టిప్పర్లు, ఐదు పొక్లెయిన్లు పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం తవ్వకాలు చేస్తూనే ఉంది. రోజుకు వెయ్యి ట్రిప్పులు గ్రావెల్‌ను తరలిస్తున్నారు. అనుమతించిన ప్రభుత్వ భూములే కాకుండా అనుమతి లేని భూముల్లో కూడా యథేచ్ఛగా తవ్వకాలు చేసేస్తున్నారు. 10 నుంచి 17 అడుగుల లోతులు వరకు తవ్వకాలు చేసి తరలిస్తున్న గ్రావెల్ వల్ల ఏర్పడిన గోతుల్లో టిప్పర్లు మరమ్మతులు చేసే గ్యారేజ్‌లు, సిబ్బంది విడిది గదులను ఏర్పాటు చేసుకొన్నారు. బోరు పాయింట్‌ను నిర్మించి నీటిని వినియోగించుకొంటున్నారు. సమీపంలో ఉన్న పైడేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా తీసుకొచ్చి గ్రావెల్ తరలించగా ఏర్పడిన భారీ గోతులనే ఇసుక డిపోలుగా మలుచుకొని నిల్వ చేస్తున్నారు. బీద సోదరులు అండదండలతో ప్రారంభమైన ఈ అక్రమ గ్రావెల్ తరలింపు దందా రాష్ట్రంలో అధికారం మారినప్పటికీ గ్రావెల్ తరలింపు నిర్విరామంగా జరుగుతున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే అధికారిక అంచనాల ప్రకారం రూ.300 కోట్లు విలువ చేసే గ్రావెల్‌ను అక్రమంగా తరలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత శాఖాధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే తవ్వేసిన గ్రావెల్‌కు సంబంధించి ఇంజినీరింగ్ సంస్థకు జరిమానాలు విధించడంతో పాటు తవ్వకాలను ఆపేయడమా? సీనరైజ్ వసూలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. -
వీళ్లు ఎవరికీ చిక్కరు.. దొరకరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బీద క్యాంపులో ఆర్థిక అలజడికి తెరలేచింది. వారం రోజులుగా బీద క్యాంపు చుట్టూ అధికార పార్టీ అభ్యర్థులు చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆర్థిక వ్యవహారం అంతా బీద బ్రదర్స్ చూసుకుంటారని జిల్లాకు వచ్చినప్పుడు అభ్యర్థులకు చెప్పి వెళ్లారు. అయితే ఇప్పటివరకూ రూపాయి కూడా విదల్చలేదని కొందరు అభ్యర్థులు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. మరికొందరైతే డబ్బులు ఇవ్వకుండానే పెత్తనం చేస్తున్నారని కినుకు వహిస్తున్నారు. దీనికితోడు వైఎస్సార్సీపీలోకి నేతలు పెద్ద ఎత్తున వలసల బాట పట్టడంతో అధికార పార్టీకి చెందిన క్యాంపు సతమతమవుతోది. ఇక అందర్నీ సమన్వయం చేయాల్సిన జిల్లా అధ్యక్షుడు, బీద మస్తాన్‌రావు సోదరుడు రవిచంద్ర చిక్కడు.. దొరకడు తరహాలో తప్పించుకుని తిరుగుతుండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అధికార పార్టీ నుంచి అభ్యర్థులుగా దిగిన వారిలో ఒకరు ఇద్దరు మినహా అందరూ బడాబాబులే. దీంతో పెద్ద ఖర్చు లేకుండా ఎన్నికల బరిలో తలపడవచ్చన్న బీద బ్రదర్స్‌కు అభ్యర్థులు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటించారు. చివరకు నెల్లూరు రూరల్, కావలికి అభ్యర్థి దొరక్క మొదట తిరస్కరించిన నేతలకే టికెట్లు ఇచ్చారు. దీంతో మొదట భారీగా ఖర్చు పెడతామని ప్రచారం చేసుకున్న నేతలు అంతా సర్దుకున్నారు. అసలే పార్టీ పరిస్థితి చూస్తే మెరుగ్గా లేకపోవడం, రూ.కోట్లు ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేదని అర్థమైన నేతలు భారీగా ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు. ఏదో బీద ఇస్తే ఖర్చు చేయాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ పరిస్థితి అర్థమైన బీద పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనని మొండికేసిన బీద మస్తాన్‌రావు ఎట్టకేలకు పార్టీ అధినేత ఒత్తిడితో ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి ఎంత సర్దుబాటు చేయాలనే దానిపై బీద బ్రదర్స్ తలలు పట్టుకుని కుర్చోన్నారు. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది ముందుగానే చంద్రబాబు ఫైనల్ చేసి నేతలకు చెప్పి వెళ్లినట్లు సమాచారం. అయితే గత వారం నుంచి మినీబైపాస్ రోడ్డులోని బీద క్యాంపుల్లో మాత్రం రోజు అభ్యర్థులు ఆర్థిక మంతనాలు చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా కావలి అభ్యర్థిగా కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బీద సోదరుల మద్దతుతో టికెట్ ఇచ్చారు. ఆయన ఖర్చు మొత్తం కూడా తామే చూసుకుంటామని చెప్పారు. నామినేషన్ ఘట్టం, స్క్రూటినీ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఒక్క రూపాయి ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి కినుక వహించినట్లు సమాచారం. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు రెండో సారి టికెట్ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక పరిస్థితి లేక చేతులెత్తేసిన క్రమంలో ఎంపీ అభ్యర్థి చూసుకుంటాడని చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు ఆర్థిక వ్యవహరాలు కూడా మాట్లాడుకున్నారు. కానీ డబ్బులు మాత్రం చేతికి అందలేని బొల్లినేని నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటూ తన పని తన ఓటు మాత్రమే తాను చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక నెల్లూరు రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్‌ది మాత్రం విచిత్ర పరిస్థితి. గతంలో నెల్లూరు రూరల్ లేదంటే సిటీ టికెట్ కోసం బలంగా ప్రయత్నాలు చేసిన అజీజ్ భంగపడ్డారు. నెల్లూరు పార్లమెంట్ టికెట్ అయినా తనకు ఇస్తే గట్టిగానే ఖర్చు పెట్టుకుంటానని సీఎంకు మొర పెట్టుకున్నాడు. అయితే చివరి నిమిషంలో నెల్లూరు రూరల్ టికెట్ దక్కడంతో ఆర్థికంగా పూర్తిగా చేతులెత్తేసి మీరే అంతా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం. దీంతో నగర అభ్యర్థిగా బరిలో ఉన్న మంత్రి నారాయణ, ఎంపీ అభ్యర్థి నుంచి సహకారం ఉంటుందని చెప్పారు. అయితే మంత్రి నారాయణ సహకారం మొదలయింది కానీ పెత్తనం అంతా నారాయణ క్యాంప్దే కావడంతో మేయర్ వర్గంలో తీవ్ర అలజడి రేగింది. కేవలం ఎన్నికల ప్రచారంలో నమస్కారం పెట్టుకుంటూ తిరగడానికే మేయర్ పరిమతం అయినట్లు సమాచారం. ఇక రాత్రి వ్యవహారాలన్ని నారాయణ క్యాంపు నుంచి ఆయన సన్నిహితుడు తన సొంత టీమ్‌తో నడుపుతుండటంతో అజీజ్ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరో అసెంబ్లీ అభ్యర్థికి ఆ నియోజకవర్గంలో భారీ వలసలు షాక్‌ను ఇచ్చాయి. దీంతో సదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ఎంత ఖర్చు చేసినా గెలవలేము.. కాబట్టి డబ్బు ఖర్చు చేయొద్దని సదరు అభ్యర్థి కుమారుడు గట్టిగా చెప్పటంతో అక్కడ గందరగోళం రేగింది. దీంతో అప్పటి దాక ఎంపీ అభ్యర్థి నుంచి ఆర్థిక సహకారం వద్దన్న సదరు అభ్యర్థి రెండు రోజుల నుంచి అభ్యర్థి క్యాంపు చుట్లూ చక్కర్లు కొడుతున్నాడు. మొత్తం మీద ఒక్క అభ్యర్థికి కూడా చెప్పినది ఇవ్వకుండా ఇంకా బాబు గారి నుంచి అనుమతి రాలేదంటూ కాలం గడుపుతుండటం పార్టీలో చర్చనీయాశంగా మారింది. -
బీదపై బొల్లినేని అప్పుల బండ
సాక్షి, నెల్లూరు: ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’ ఉదయగిరి టీడీపీ అభ్యర్థి బొల్లినేని రామారావుకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అసమ్మతి తలనొప్పి.. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు సంకటంగా మారింది. ఉదయగిరి నియోజవర్గంలో చేపట్టిన ఫైబర్ చెక్‌డ్యామ్ పనులను బొల్లినేని స్థానిక నేతలకు సబ్‌కాంట్రాక్ట్‌గా ఇచ్చి చేయించారు. ఆ బిల్లులను వసూలు చేసుకుని తన ఖాతాలో వేసుకున్నాడే కానీ.. పనులు చేసిన నేతలకు డబ్బులు ఇవ్వలేదు. తమ డబ్బులు ఎగనామం పెట్టిన ఎమ్మెల్యే బొల్లినేనికి ఎన్నికల సమయంలో సదరు నేతలు చుక్కలు చూపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇస్తే కానీ ఎన్నికల్లో పని చేయమని తెగేసి చెప్పడంతో వారిని సర్దుబాటు చేసే వ్యవహారంలో భాగంగా బొల్లినేని అప్పుల బండను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావు నెత్తినేసుకున్నాడు. బొల్లినేని బాధితులను నెల్లూరులోని తమ కార్యాలయం వద్దకు పిలిపించుకుని నగదు సర్దుబాటు చేస్తున్నారు. ముందుగా నియోజకవర్గంలోని రూ.10 లక్షల లోపు బకాయిలు ఉన్న వారిని పిలిపించుకుని వారికి సగం నగదు ఇచ్చేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ పూర్తిస్థాయిలో బకాయిలు ఇచ్చే వరకు ఈ ఎన్నికల్లో బొల్లినేనికి పని చేయమని వారు తెగేసి చెబుతుండడంతో వారిని ఒప్పించేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. రూ.9 కోట్ల బకాయిలు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కొత్త టెక్నాలజీ పేరుతో దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో పైబర్చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టారు. మహారాష్ట్రలోని పైబర్ చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు ఉపయోగ పడుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నియోజక వర్గంలో పైబర్ చెక్ డ్యామ్‌లు నిర్మాణాలకు çపూనుకున్నారు. ఖర్చు తక్కువతో నిర్మాణాలు జరిగే పైబర్ చెక్ డ్యామ్‌ల నిర్మాణాల్లో అంచనా భారీగా పెంచి వేయించారు. తన సొంత కంపెనీ పేరుతోనే టెండర్లు దక్కించుకుని ఆయా చెక్‌డ్యామ్ నిర్మాణ పనులను నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలకు పంపకాలు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించారు. కానీ ఆయా బిల్లులు పూర్తిస్థాయిలో తీసుకున్న బొల్లినేని రామారావు సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదు. దాదాపు రూ.9 కోట్ల వరకు బిల్లులు ఇవ్వకుండా మూడేళ్లగా వారిని ముప్పు తిప్పులు పెట్టారు. వీరే కాకుండా మహారాష్ట్ర, ఏపీలో కూడా బొల్లినేని కంపెనీ నుంచి బిల్లులు రావాల్సిన జాబితా చాలానే ఉంది. సబ్ కాంట్రాక్టర్లకు రావాల్సిన నగదు ఇవ్వకుండా ఎగనామం పెట్టిన ఎమ్మెల్యేపై వారు పోరాటం చేయలేకపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాధితులంతా ఏకమై బొల్లినేని వ్యవహారంపై తీవ్రంగా పోరాటం చేశారు. ఒకనొక దశలో సీఎం చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టి టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని హెచ్చరించి వచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనికి టికెట్ ఇవ్వకుండా చివరి వరకు జాప్యం చేసినా, కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి టికెట్ ఇచ్చారు. కానీ బొల్లినేని బాధితులు మాత్రం మా బిల్లులు ఇస్తే కానీ ఆయనకు పని చేయమని తెగేసి చెప్పడంతో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లడంతో మింగుడు పడని బొల్లినేని ఈ వ్యవహారం చక్కదిద్దాలని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్‌రావుకు అప్పగించారు. ఆయన నియోజకవర్గంలోని బొల్లినేని బాధితులను పిలిపించుకుని వారికి కొంత సర్దుబాటు చేసి పంపే ప్రయత్నాలు మమ్మురం చేశారు. దీంతో బొల్లినేని నగదు సర్దుబాటు చేస్తున్నారని తెలియగానే బాధితులు క్యూ కట్టారు. కేవలం నియోజకవర్గానికి చెందిన బాధితులను మాత్రం పిలిపించుకుని సర్దుబాటు చేస్తున్నారు. మిగిలిన వారికి పట్టించుకోకపోవడంతో వారు ఆగ్రహాం వ్యక్తం చేస్తునారు. -
బలవంతంగా టీడీపీ కండువా కప్పాడు
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): టీడీపీ ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు తనకు బలవంతంగా టీడీపీ కండువా కప్పాడని, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఇందుకూరుపేట మండల నాయకుడు కైలాసం ఆదిశేషారెడ్డి తెలిపారు. తన స్నేహితుడైన బీద మస్తాన్‌రావు మంగళవారం నెల్లూరులోని తన ఇంటికి వచ్చాడు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని..సాయం చేయాలని కోరాడు. ఇందుకు తాను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పనితీరు నచ్చక రెండేళ్ల క్రితమే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటే ఉంటానని, తన శత్రువైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యేగా నిలబడితే సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాను. ఇందుకు బీద సరే తన కార్యాలయం వరకు వదలమని కోరాడు. బీఎంఆర్ కార్యాలయం వద్దకు వెళ్లగానే లోపలి వరకు రమ్మని పిలిచాడు. టీడీపీ కార్యాలయం కాదు కదా బీఎంఆర్ కార్యాలయమని లోపలికి వెళ్లగా అక్కడ కొందరు టీడీపీలో చేరుతున్నారు. వారితో పాటు బీద తనకు పార్టీ కండువాను బలవంతంగా కప్పాడు. దీంతో తాను అక్కడి నుంచి బయల్దేరి ఇంటికి వచ్చేశాను. తాను ఎట్టిపరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కైలాసం తెలిపారు. -
అంతా నా ఇష్టం
సాక్షి, కావలి (నెల్లూరు): కావలిలో టీడీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి జరగనివ్వడం లేదు. అందులో ప్రధానమైనది కావలి పట్టణంలోని స్టేడియం. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన కావలి పట్టణం గత 50 ఏళ్లుగా జిల్లాలో విద్యాసంస్థల హబ్‌గా ఉంది. ప్రకాశం జిల్లా ను ఆనుకుని కావలి పట్టణం ఉండటంతో ఆ జిల్లాకు చెందిన విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడి విద్యా సంస్థల్లో చదువుకుంటుంటారు. అలాగే క్రీడల్లో రాణించేవాళ్లు కోకొల్లలుగా ఉండటంతో కావలిలో క్రీడలను ప్రోత్సహించడానికి అనువుగా స్టేడియం నిర్మించాలని చాలా ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. హామీ మరిచిన బీద మస్తాన్ స్టేడియం కోసం పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో జనతాపేట ప్రాంతంలో అత్యంత ఖరీదైన ప్రదేశంలో ఉన్న 9 ఎకరాలను అధికారులు కేటాయించారు. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. అప్పటి నుంచి ఈ స్టేడియం నిర్మించడానికి నిధులు మంజూరు కాలేదు. అయితే ప్రస్తుతం నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న బీద మస్తాన్‌రావు, 2009–2014 కాలంలో కావలిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కావలి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ స్టేడియం నిర్మాణం ఒకటి. ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం స్టేడియం నిర్మాణానికి పైసా నిధులు మంజూరు చేయించలేదు. కానీ 2014లో మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల సమయాన ‘ 18, ఫిబ్రవరి 2014 ’ తేదీన స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన అంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిధులు లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ఉత్తుత్తి శిలాఫలకాన్ని బీద మస్తాన్‌రావు ఆవిష్కరించారు. కాగా ఆ ఎన్నికల్లో బీద మస్తాన్‌రావు ఓడిపోయారు. అయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో కావలిలో 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అధికార పార్టీ నాయకుడుగా బీద మస్తాన్‌రావు ఈ ఐదేళ్ల కాలంలో స్టేడియం నిర్మాణానికి పైసా నిధులు మంజూరు చేయించలేదు. డిజైన్ మార్చాలని హుకుం కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధం కాగానే అధికార టీడీపీ నాయకుడు హోదాలో అక్కడికి వచ్చి నిర్మాణాలకు సంబంధించిన డిజైన్‌ను మార్చేయాలని అధికారులకు హుకుం జారీ చేశారు. బీద మస్తాన్‌రావు సూచించిన ప్రకారం స్టేడియం భవనం సువిశాలమైన 9 ఎకరాల స్థలంలో నడిబొడ్డుకు చేరుకుంటుందని, ఆ విధంగా నిర్మించడం వల్ల అన్ని రకాల క్రీడలకు స్థలం చాలక ఇబ్బందులు పడాల్సి వస్తోందని అధికారులు బీద మస్తాన్‌రావుకు నచ్చజెప్పారు. అయితే ఆయన అధికారుల మాటలను ఖాతరు చేయకుండా, అధికార పార్టీ నాయకుడిగా తాను చెప్పిందే కావలిలో జరగాల్సిందే అని పట్టుబట్టారు. ఈ అంశంలో బీద మస్తాన్‌రావుపై విమర్శలు వెల్లువెత్తినా ఆయన పట్టించుకోలేదు. ఒక నిర్ణయం తీసుకున్నాక అది అమలు జరిగి తీరాల్సిందే అంటూ పట్టుదలకు పోయారు.దీంతో రూ.2 కోట్లతో స్టేడియం నిర్మాణం పేరుతో అత్యంత ఖరీదైన 9 ఎకరాల స్థలాన్ని టీడీపీ నాయకులు నాశనం చేస్తున్నారని సర్వాత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విస్తుపోతున్న స్థానికులు స్టేడియం నిర్మించే ప్రాంతం పట్టణంలో నేడు ఖరీదైన ప్రాంతంగా మారింది. దానికి తోడు ఉదయగిరి రోడ్డుకు అనుకొని ఉండటంతో పాటు నివాస ప్రాంతాలకు ప్రీమియం ఏరియాగా ఉంది. అక్కడ ఎకరాలు స్థలం దొరికే పరిస్థితి లేదు. అందుకే అంకణం స్థలం కనీసం రూ.లక్ష నుంచి రూ 1.5 లక్షలు ధర పలుకుతుంది. అంటే ఎకరా రూ.7 నుంచి 8 కోట్లు ఉటుంది. సుమారు రూ.60 కోట్లు విలువ చేసే అత్యంత విలువైన స్థలాన్ని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 2 కోట్ల నిధులతో స్టేడియం భవనాన్ని నడిబొడ్డున నిర్మిస్తూ విశాలమైన స్థలాన్ని నాశనం చేస్తున్న తీరు పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఇంజినీర్లు డిజైన్ చేసిన విధంగా కాకుండా, నిధులను సేట్డియం స్థలాన్ని చెడగొట్టడానికి నిర్మాణం చేయడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. రూ.2 కోట్ల నిధుల మంజూరు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించే విధానపరమైన నిర్ణయాలను అమలు పరిచే క్రమంలో దేశంలో పలుచోట్ల స్టేడియాలను నిర్మించడానికి నిధులు మంజూరు చేసింది. ఆ విధంగా కావలిలో కూడా స్టేడియం నిర్మించేందుకు రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసింది. స్టేడియంను ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి ఆటలన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇంజినీర్లు కావలిలో స్టేడియం నిర్మాణానికి డిజైన్‌తో కూడిన ప్లానింగ్ తయారు చేసి, ఆ మేరకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. -
రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్.. కానీ ఇంతలోనే..
సాక్షి, కావలి: కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్ డి.జయప్రకాష్ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. అసలు భూములు కథ ఏమిటంటే.. దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం, సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. విలేజ్ అసిస్టెంట్ నుంచి.. రెవెన్యూ శాఖలో విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరిన డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను, ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు. ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్తన్‌రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్ హోదాలో డి.జయప్రకాష్ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యారు. ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. -
తహసీల్దార్‌ను బంతాట ఆడుకున్న బీద సోదరులు..
కావలి: కావలి టీడీపీ నాయకులు బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రల అడ్డమైన దోపిడీకి ఉద్యోగాన్ని పోగొట్టుకున్న దగదర్తి తహసీల్దార్ డి.జయప్రకాష్ కేవలం రెండు రోజుల్లో ఆర్డీఓగా పదోన్నత పొందాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఫైలు చాలా కాలంగా ఉంది. అయితే ప్రాధాన్యతల వారీగా రాష్ట్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా ఉండే సీనియర్ ఐఏఎస్ అధికారి ఈ ఫైలుపై సంతకాలు చేయాల్సి ఉంది. ఇంతలో టీడీపీ నాయకుల భూ దందాలో చిక్కుకుని బలైపోయారు. అసలు భూములు కథ ఏమిటంటే.. దగదర్తి మండలంలో ప్రభుత్వ భూములు వేల ఎకరాలు ఉండటం, ఆ ప్రాంతానికి చెందిన వారు ఇతర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలసలు పోవడం, సంపన్నులు తమ ఆస్తులు పెంచుకునే క్రమంలో మండలంలోని భూములపై కన్ను పడటం, వలస వెళ్లిపోయిన మండలానికి చెందిన ప్రజలు ఆర్థికంగా స్థిరత్వం పొందడంతో వారి గ్రామాల్లో ని భూములపై ఆసక్తి కనపరిచారు. అలాగే మండలంలో విమానాశ్రయం నిర్మించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం, పరిశ్రమలు స్థాపనకు మండలంలోని భూములను గుర్తించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ కూడా జరిగేసరికి 2014 సంవత్సరం వచ్చింది. అప్పుడే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కావలి నియోజకవర్గంలో అధికార టీడీపీ నాయకులుగా బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రలు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో తమ అదుపులోకి తెచ్చుకున్నారు. బీద సోదరులు తమ ఆక్వా సామ్రాజ్యాన్ని అల్లూరు మండలంలోని సముద్రతీరం వెంబడి వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో విస్తరించుకున్నారు. అక్కడికి ఆగక విస్తరణను దగదర్తి మండలంలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములు వరకు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఒక పక్క విమానాశ్రయ భూములు, మరో పక్క పరిశ్రమలకు భూములు అంటూ టీడీపీ ప్రభుత్వం దగదర్తి మండలంలో భూసేకరణకు తెరతీసింది. ఇవన్నీ ముందస్తుగానే తెలిసిన బీద సోదరులు దగదర్తి తహసీల్దార్‌గా తమ కనుసన్నల్లో ఉన్న వారినే నియమించుకోసాగారు. విలేజ్ అసిస్టెంట్ నుంచి.. రెవెన్యూ శాఖలో విలేజ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరని డి.జయ ప్రకాష్, ప్రమోషన్లతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) అయిన, ప్రస్తుతం తాహసీల్దార్ వరకు చేరుకున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్డీఓగా ప్రమోషన్ ఉత్తర్వులను అందుకోవాల్సి ఉండగా, టీడీపీ నాయకులతో కలిసి చేసిన భూదందాల పాపంలో పాలు పంచుకుని వాటాలు మింగడంతో సస్పెండ్ ఉత్తర్వులు అందుకున్నారు. 2019 ఏప్రిల్ 30వ తేదీన ఉద్యోగ విరమణ చేయనున్న డి.జయప్రకాప్‌ను, ఎన్నికల బదిలీల్లో జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్లను బదిలీ చేసినా ఆయన్ను చేయలేదు. ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉండటంతో డి.జయప్రకాస్ సేవలు దగదర్తి తాహసీల్దార్‌గానే అందిస్తారని టీడీపీ నాయకులు బీద మస్న్రావు, బీద రవిచంద్ర చేసిన ఒత్తిళ్లకు ఉన్నత స్థాయి అధికారులు తలొగ్గి ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల సంఘం ఆ పప్పులు ఉడకవని హెచ్చరించడంతో డి.జయప్రకాష్‌ను కోనేరు రంగారావు కమిటీలో విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. ఇంతలో కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు ఆదేశాలతో కావలి సబ్ కలెక్టర్ చామకూరు శ్రీధర్ కొన్ని భూదందా ఫిర్యాదులపై చేసిన విచారణలో దగదర్తి తాహసీల్దార్ హోదాలో డి.జయప్రకాష్ చేసిన అక్రమాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయ్యారు. దీంతో ఆర్డీఓ హోదాలో ఉద్యోగ విరమణ చేయాల్సిన డి.జయప్రకాష్, టీడీపీ నాయకులు అక్రమాల దందాల్లో భాగస్వామ్యం కావడంతో ఆ ఉత్తర్వులు అందుకోకుండానే తాహసీల్దార్‌గానే పదవీ విరమణ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా తమ అక్రమాలకు తాహసీల్దార్ హోదాలో ఉన్న డి.జయప్రకాష్‌ను అన్ని రకాలుగా వాడుకున్న టీడీపీ నాయకులు బీద సోదరులు కనీసం సస్పెండ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఆయన్ను పలకరించలేదు. దీంతో ఆయన పలువురి వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి క్షోభకు గురి అవుతాన్నట్లు సమాచారం. తహసీల్దార్‌ను బంతాట ఆడుకున్నారు ఈ నేపథ్యంలో రెండేళ్ల (జనవరి 2017) క్రితం దగదర్తి తహసీల్దార్‌గా డి.జయప్రకాష్‌ను నియమించుకున్నారు. దగదర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తమ గ్రామాల్లోని ప్రభుత్వ భూములు తమకే చెందాలని ఆసక్తి చూపసాగారు. అలాగే ఇతర ప్రాంతాలకు చెందిన సంపన్నులు లాబీయింగ్‌తో భూములు కాజేయడానికి స్కెచ్‌లు వేయసాగారు. ఈ క్రమంలో బీద సోదరులు ఒక పక్క, దగదర్తి మండలానికి చెందిన టీడీపీ నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, మాలేపాటి రవీంద్రనాయుడు మరో పక్క తహసీల్దార్ డి.జయప్రకాష్‌ను బంతాట ఆడుకున్నారు. ఆయన కూడా ఆర్థికంగా లాభదాయకమైన ఈ రకమైన ఆటకు సిద్ధపడే వారు చెప్పిన పనులన్నీ చేశారు. పనిలో పనిగా ఆయన కూడా చిలకొట్టుడు కొట్టేవారు. ఇలా తహసీల్దార్ రెండు రకాలుగా సంపాదించారు. టీడీపీ నాయకులు చెప్పినట్లు ప్రభుత్వ రికార్డుల్లో భూమి హక్కుదారులుగా పేర్లు చేర్చితే వారి వద్ద చేతులు తడుపుకోవడం, ఇతరులు వచ్చి అమ్యామ్యాలు ఇస్తే ఆ పేర్లును తొలిగించేవారు. ఇలా భూములకు హక్కుల కల్పించే విషయంలో టీడీపీ నాయకులు, తహసీల్దార్ కలిసి భారీ దందానే చేశారు. పనిలో పనిగా బీద సోదరులు తమకు అవసరమైన భూములకు రికార్డులు సృష్టించుకోగలిగారు. అందుకే భూమి హక్కులదారుల విషయంలో దగదర్తి మండలంలో తహసీల్దార్, కావలి సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) కార్యాలయాల్లో, హైకోర్టు, లోకాయుక్తా తదితర న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. గత రెండేళ్లుగా దగదర్తి తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న డి.జయప్రకాష్, ఏ రోజు కూడా తన కార్యాలయంలో పని వేళల్లో తన సీట్లో కూర్చొని విధులు నిర్వర్తించలేదు. కార్యాలయ పని వేళలు దాటిన తర్వాత మాత్రమే సీట్లో కూర్చొని టీడీపీ నాయకులు చెప్పిన వ్యవహారాలు చక్కబెట్టేవారు. అలాగే డాబాల్లో, లాడ్జీల్లో రికార్డులు వెంట పెట్టుకుని వచ్చి టీడీపీ నాయకులు చెప్పిన అడ్డమైన భూమి యాజమాన్య హక్కులు కల్పించే పనులు చేస్తుండేవారు. పనిలో పనిగా టీడీపీ నాయకులు చేసే గ్రావెల్ దందాకు కూడా తహసీల్దార్ సంపూర్ణంగా సహకరించారు. -
అభ్యర్థి ఎవరో..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలు పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరువయ్యారు. ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట చేతులెత్తేయడంతో ఇప్పుడు టీడీపీకి అభ్యర్థిని వెతుకు లాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తొలుత ఎమ్మెల్సీ కరణం బలరాంను ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని ఆలోచించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కరణంను చీరాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి నిలపాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. బీదా సోదరులు ఇందుకు అంగీకరిస్తారా.. లేదా..? అన్నది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రకటించింది. తానే పోటీలో ఉంటానని మాగుంట సైతం ప్రకటించారు కూడా. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు నుంచి తాను పోటీ చేయలేనని ఎమ్మెల్సీ మాగుంట టీడీపీ అధిష్టానానికి, ఇటు జిల్లా నేతలకు తేల్చి చెప్పారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో మాగుంట ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సమర్థులైన అభ్యర్థులు లేరని వీరితో కలిసి పోటీకి దిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతులో ఓటమి ఖామయని మాగుంట భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జిల్లా నేతలకు ఆయన వివరించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉందని, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రతిపక్ష పార్టీని ఎదుర్కోవడం సాధ్యమయ్యేది కాదని మాగుంట భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోటీకి ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానం, జిల్లా నేతలు బుజ్జగించినా ఆయన ససేమిరా అంటున్నట్లు సమాచారం. మాగుంట పోటీకి దూరమయ్యే పక్షంలో టీడీపీకి ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు కనిపించడం లేదు. ఆర్థికబలం, అంగబలం ఉన్న మాగుంటే ఓడిపోతానని చెబితే మిగిలిన వారు పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మారింది. రోజు రోజుకు ఆపార్టీ పార్లమెంటు నియోజకవర్గంలో బలం పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో తెలిసి పోటీ చేసి ఓటమి కొని తెచ్చుకోవడం ఎందుకని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బయటి ప్రాంతాల నుంచి కొత్త వారిని తెచ్చి ఇక్కడ పోటీలో నిలపాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. బలరాంను చీరాలలో నిలిపేందుకు సీఎం పట్టు.. మాగుంట పోటీ నుంచి తప్పుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత కరణం బలరాంను ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో కరణం బలరాంను చీరాల నుంచి బరిలో దింపుతారన్న ప్రచారం జోరందుకుంది. తాము చీరాల నుంచి పోటీ చేయడం లేదని, ఆ నియోజకవర్గానికి చెందిన బీసీ నేతలలో ఒకరిని టీడీపీ అభ్యర్థిగా పోటీలో నిలుపుతామని కరణం చెబుతున్నా.. సీఎం ఒత్తిడి తెస్తే చివరకు కరణం బలరాం పోటీలో ఉండక తప్పని పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కరణం ఒంగోలు పార్లమెంటుకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. తెరపైకి బీదా.. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. బీదా మస్తాన్‌రావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా యాదవ సామాజిక వర్గం బలంగానే ఉంది. బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. మరో వైపు ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీడీపీ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే బీసీ అభ్యర్థి లేరు. ఒకవేళ చీరాలకు బీసీ అభ్యర్థిని కేటాయిస్తే ఆ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అవుతుంది. అలా కాకుండా కరణం బలరాంను చీరాల అభ్యర్థిగా ఎంపిక చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ నుంచి బీసీ అభ్యర్థి లేనట్లే అవుతోంది. ఈ క్రమంలో పార్లమెంటు నుంచి బీసీ అభ్యర్థిని నిలిపి ఆ సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీదా మస్తాన్‌రావును ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్టానం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన సోదరుడు బీదా రవిచంద్రతో బుధవారం రాత్రి అమరావతిలో అధిష్టానం చర్చలు జరిపింది. ఈ పరిస్థితిలో బీదా సోదరులు ఒంగోలు నుంచి బరిలోకి దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. -
ఐటీ ఉచ్చులో బీద
నెల్లూరు, కావలి: నవ్వాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కమిటీ సభ్యుడు, కావలి టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు వ్యాపార సామ్రాజ్యం ఆదాయపన్ను శాఖ ఉచ్చులో చిక్కుకుంది. ప్రధానంగా రొయ్య పిల్లల అమ్మకాలు, రొయ్యల ఎగుమతులు, రొయ్యల మేత అమ్మకాలు ద్వారా చట్టాలను ఉల్లంఘించినట్లుగా గుర్తించి చెన్నై కేంద్రంగా విధులు నిర్వర్తించే ‘కేంద్ర ఐటీ పరిశోధన’ అధికారుల బృందం గురువారం దాడులు నిర్వహించింది. ఐటీ అధికారులు టర్నోవర్, తగిన రసీదులు, బ్యాంక్ ఖాతాలు వివరాలతో పాటు వ్యాపారాల్లో విదేశీ మారకద్రవ్యంకు సంబంధించిన లావాదేవీలపై దృష్టి పెట్టి రికార్డులను, కంప్యూటర్లోని హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. కావలి వద్ద రొయ్య పిల్లల అమ్మకాలు నుంచి అమెరికాలో ఏర్పాటు చేసిన రొయ్యల అమ్మకాల కేంద్రం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను ఐటీ అధికారులు సునిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారని ముందస్తుగా అందిన సమాచారంతో దామవరంలోని బీఎంఆర్ ఫ్యాక్టరీల్లో ఉన్న విలువైన సమాచార డాక్యుమెంట్లను అదే సంస్థలో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బోగోలుకు చెందినగొర్రె రామకృష్ణ ఇంటికి తరలించేసినట్లు తెలిసింది. ఇది బీద మస్తాన్‌రావు ప్రస్థానం ♦ 1991 నుంచి 1996 వరకు సవేరా గ్రూపునకు చెందిన ‘కేర్‌వెల్’ కంపెనీలో స్వల్ప జీతానికి పనిచేశారు. ♦ మాగుంట గ్రూప్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి ద్వారా బ్యాంక్ ఆఫ్ బరోడాలో నలుగురు మిత్రులతో కలిసి అప్పు తీసుకొని అల్లూరు మండలం ఇస్కపల్లిలో ‘బీఎంఆర్’ రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం (హేచరి)ను ప్రారంభించారు. ♦ చెన్నైలోని మెరీనా బీచ్‌లో ‘క్లాస్విన్’ అనే పేరుతో హేచరీని 1997లో స్థాపించారు. ♦ హేచరీ నిర్వహణ బాధ్యత చూస్తున్న బీద మస్తాన్‌రావు నష్టాలు వచ్చాయని చెప్పి భాగస్తులను వదిలించుకున్నారు. ♦ హేచరీస్‌లో నష్టాలు రావడంతో బ్యాంక్‌కు వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో, ఆ నాటి ఒక టీడీపీ మంత్రి అండదండలతో ‘పనికి ఆహార పథకం’ ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పరచుకుని బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సెస్ బ్యాంక్‌లను ప్రభావితం చేసి అప్పులు సంపాదించారు. ♦ 2001 నుంచి 2008 వరకు పాండిచ్చేరి నుంచి వైజాగ్ వరకు పలు హేచరీలను లీజుకు తీసుకున్నారు. ♦ టైగర్, స్కాంపీ రకం రొయ్యల పిల్లల హేచరీల ద్వారా కోట్ల రూపాయలు లాభాలు ఆర్జించి ఆర్థికంగా బలపడ్డారు. ♦ వైజాగ్‌లో రెండు, చెన్నైలో రెండు, పాండిచ్చేరిలో రెండు, విడవలూరు మండలం రామతీర్థంలో ఒకటి, అల్లూరు మండలం ఇస్కపల్లిలో హేచరీలను స్థాపించారు. ♦ 1998లో బినామీ సొసైటీలను సృష్టించి ఇస్కపల్లిలోని మత్స్యకారుల భూములను, మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన డి–ఫారం పొలాలను, రైతుల వద్ద కొనుగోలు చేసిన భూములు మొత్తం సుమారు 700 ఎకరాల్లో రొయ్యలు సాగు చేయడం ప్రారంభించారు. ♦ దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయ భూముల వద్ద ఉన్న పేదల భూములను అధికారుల ద్వారా 2013లో వశపరుచుకుని 2014లో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్, రొయ్యల మేత తయారీ ఫ్యాక్టరీ నిర్మించారు. ♦ బెంగళూరులోని సూర్య సిటీ వద్ద 25 ఎకరాల్లో జరుగుతున్న రియల్ ఎస్టేట్, నిర్మాణాలు, హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద హరిప్రియ ఎస్టేట్స్ 23 ఎకరాల్లో నిర్మాణాలు, హైదరాబాద్‌లోని టాటా హెలికాప్టర్ తయారీ కేంద్రమైన ఆదిభట్ల వద్ద 35 ఎకరాల్లో జరుగుతున్న నిర్మాణాలు, కావలి మండలంలో తీర ప్రాంత గ్రామం నందెమ్మపురంలోని మత్స్యకారుల భూములను ప్రభుత్వం ద్వారా స్వాధీన పరుచుకుని నిర్మాణంలో ఉన్న హేచరీ, పాండిచ్చేరిలో నూతనంగా నిర్మిస్తున్న హేచరీ, దేశ వ్యాప్తంగా ఉన్న బిగ్–సీ మొబైల్ గొలుసు సంస్థలో వాటాలు, తమిళ సినిమా రంగంలో పెట్టుబడులు, ఇటీవలే విడుదలైన తమిళ సినిమా వ్యాపార లావాదేవీలు, జేఆర్ఆర్ (జయమ్మ–రఘురామయ్య) ఇన్ఫాస్ట్రక్చర్ తదితర సంస్థలను బినామీ పేర్లుతో నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. -
నెల్లూరు జిల్లాలో అధికార టీడీపీకి షాక్
-
నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్!
సాక్షి, నెల్లూరు : ఐటీ దాడులతో నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నేతలకు షాక్ తగిలింది. టీడీపీ నేత బీద రవిచంద్ర, ఆయన సోదరుడు మస్తాన్ రావు కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం దామవరం, ఇసుకపల్లిలోని బీఎంఆర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు జరిపారు. చెన్నైలోని బీఎంఆర్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రికార్డులు, కంప్యూటర్ డేటాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో రొయ్యల వ్యాపార లావాదేవీలపై బీద సోదరులను ఆరా తీసినట్లు సమాచారం. -
మీరే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కావలి: కావలిలో టీడీపీని మీ అవినీతి పనులతో భ్రష్టు పట్టించారని మున్సిపల్ చైర్పర్సన్ అలేఖ్య, ఆమె భర్త శ్రీకాంత్‌లపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి బీద మస్తాన్‌రావు మండిపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవినీతి సొమ్ము వాటాల పంపకంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో బీద మస్తాన్‌రావు బుధవారం అలేఖ్య దంపతులను తన ఇంటికి పిలిపించుకుని వారు చేసిన అవినీతి చిట్టాను చదివి వినిపించారని ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సేకరించిన సమాచారం మేరకు.. పార్టీని బతికిస్తారని మీకు అవకాశం కల్పిస్తే ప్రతి పనిలో అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతూ పార్టీని భ్రష్టు పట్టించారని బీద తీవ్ర స్వరంతో మండి పడడంతో అలేఖ్య జోక్యం చేసుకుంటూ పట్టణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అమరా యాదగిరి వల్లనే ఈ రాద్ధాంతం అంతా జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. దీంతో బీద అన్నీ నాకు తెలుసంటూ మండిపడినట్లు సమాచారం. మున్సిపాలిటీలో ఏ ఏ విభాగాల నుంచి అందుకున్న నజరానాలు, మంత్రి నారాయణ కావలి పర్యటనకు వచ్చినప్పుడు అయిన ఖర్చును తాను పెట్టానని, ఆ బిల్లులు మున్సిపాలిటీనే ఏదో ఒక రకంగా సర్దుబాటు చేయాలని అలేఖ్య అధికారులపై వత్తిడి తీసుకువచ్చిన విషయాలను బీద సవివరంగా వారికి చెప్పడంతో అలేఖ్య దంపతులు కంగుతిన్నారు. మీ వల్ల పట్టణంలో పార్టీ భ్రష్టుపట్టి పోయిందని, ఇంతకన్నా ఇంకేమి చేయగలరని బీద మస్తాన్‌రావు నిష్ఠూరమాడారు. ఆమె భర్త శ్రీకాంత్‌ను మాత్రం నీ వసూళ్ల ఆగడాలు వల్ల పట్టణంలో పార్టీ అధః పాతాళానికి వెళ్లి పోయిందన్నారు. ఇది ఇలా ఉండగా పార్టీకి చెందిన కౌన్సిలర్లు వడ్లమూడి వెంకటేశ్వర్లు, ఉప్పు వెంకటస్వామిలను మంగళవారం పార్టీ కార్యాలయానికి పిలిపించి మీ ఇద్దరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని బీద మస్తాన్‌రావు అగ్గిలంమీద గుగ్గిలమైనట్లు సమాచారం. కావలిలో పార్టీని ఏమి చేయదలుచుకున్నారని అలేఖ్య దంపతులు, కౌన్సిర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై పార్టీ శ్రేణులు చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం అంటూ చర్చించుకోవడం విశేషం. -
ఆక్వా నుంచి రాష్ట్రానికి రూ.16వేల కోట్లు
నెల్లూరు (టౌన్) : రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఆక్వా నుంచి రూ.16 వేల కోట్లు ఆదాయం వస్తుందని మాజీ ఎమ్మెల్యే, బీఎంఆర్ సంస్థ అధినేత బీద మస్తాన్‌రావు తెలిపారు. వర్సిటీ మెరైన్ బయోలాజీ విభాగంలో ప్రారంభమైన రెండు రోజుల మెరైన్ అండ్ కోస్టల్ బయో డైవర్సిటీ ఆఫ్ ఇండియ సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సులో బీద మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఆదాయం రావడంతోనే బడ్జెట్లో ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.835 కోట్లు కేటాయించిందన్నారు. బ్లాక్ టైగర్ రొయ్యకు అనుకోని విధంగా తెల్లమచ్చ వైరస్ సోకడంతో రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారని చెప్పారు. 2002లో వెనామీ రొయ్య సాగును ప్రథమంగా బీఎంఆర్ సంస్థ తైవాన్ నుంచి దిగుమతి చేసుకుందన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలలో విజ్ఞానంతో పాటు నైపుణ్యం అభివృద్ధి పరుచుకున్నప్పుడే ఉద్యోగావకాశాలు మెండుగా వస్తాయని చెప్పారు. నేడు మొబైల్ ప్రయోగాశాల నిర్వహించినా ఒక మెరైన్ బయోలజీ విద్యార్థికి నెలకు రూ.3 లక్షలు ఆదాయం లభిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, సదస్సు కార్యనిర్వహక కార్యదర్శి విజయ, ఆచార్యులు సుజాత, హరిబాబు, ప్రభుశరన్, డాక్టర్ రేచెల్ కుమారి, డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ వెంకటరాయులు, పాలకమండలి సభ్యులు కుసుమ, మాల్యాద్రి, చంద్రయ్య పాల్గొన్నారు. -
రాజ్యసభ రేసులో ఆ ఇద్దరు
నెల్లూరు: తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల వేడి ఊపందుకుంది. రేపో, మాపో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుండటంతో పెద్దల సభలో అడుగుపెట్టాలనుకుంటున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం ఈ సారి జిల్లా నుంచి ఎవరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదని ముఖ్య నేతలకు చెబుతున్నారు. అప్పటి హామీ గుర్తు చేస్తున్న ఆదాల రెండేళ్ల కిందట శాసనభసభ, లోక్‌సభకు ఎన్నికలు జరిగిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలో చేరారు. నెల్లూరు లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితిలో ఆదాలను చంద్రబాబు రంగంలోకి దించారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలైనా రాజ్యసభకు అవకాశం కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు అప్పట్లో టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఆదాల ఓడిపోవడం, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడటంతో ఆ తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ఆదాలను కోరారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల నేపథ్యంలో చంద్రబాబు జిల్లా నుంచి పొంగూరు నారాయణకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత అవకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఇచ్చారు. రాజ్యసభ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశ పెట్టుకున్న ఆదాల అప్పట్లో మిన్నకుండి పోయారు. అవకాశం దొరికినప్పుడల్లా చంద్రబాబుకు తన మనసులోని కోరికను, 2014 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ వస్తున్నారు. మంత్రి నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నందువల్ల ఈ కోణంలో కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునే రాజకీయం నడుపుతూ వచ్చారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీద అదృష్ట పరీక్ష గడచిన ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బీద మస్తాన్‌రావు సైతం రాజ్యసభ రేసులో తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. పార్టీ అధికారంలో లేని సమయంలో తాను చేసిన సేవలను గుర్తించి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చంద్రబాబును కోరుతున్నారు. నియోజక వర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలంటే తనకు పదవి అనివార్యమని ఆయన చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయం గురించి ఇప్పటికే రెండు, మూడుసార్లు చంద్రబాబు దృష్టికి తీసుకు పోయిన మస్తాన్‌రావు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రయత్నాలు ముమ్మరం చేసే పనిలో పడ్డారు. అయితే తాజా రాజకీయ సమీకరణల్లో ఈ సారి జిల్లా నుంచి పార్టీ నేతలెవరికీ అవకాశం ఇవ్వలేనని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యులతో చెప్పినట్లు సమాచారం.