
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్‌రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభకు ఎంపిక చేసినందకు మస్తాన్‌రావు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం బీద మస్తాన్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా బడుగు బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు. నన్ను, ఆర్ కృష్ణయ్యను ఎంపిక చేయడంలోనే ఆయన నిబద్ధత కనిపిస్తోంది. టీడీపీలో 30 ఏళ్లు ఉన్నా. బీసీలను పక్కన కూర్చోబెట్టుకోవడం తప్ప వారికి చేసిందేమీ లేదు. సీఎం జగన్ చేతల్లో చూపుతున్నారు. బీసీలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు ఎన్నో చేశారు. మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యలు ఇలా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment