కైలాసం ఆదిశేషారెడ్డి
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు): టీడీపీ ఎంపీ అభ్యర్థి బీద మస్తాన్‌రావు తనకు బలవంతంగా టీడీపీ కండువా కప్పాడని, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఇందుకూరుపేట మండల నాయకుడు కైలాసం ఆదిశేషారెడ్డి తెలిపారు. తన స్నేహితుడైన బీద మస్తాన్‌రావు మంగళవారం నెల్లూరులోని తన ఇంటికి వచ్చాడు. తాను ఎంపీగా పోటీ చేస్తున్నానని..సాయం చేయాలని కోరాడు. ఇందుకు తాను కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పనితీరు నచ్చక రెండేళ్ల క్రితమే టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని, ప్రసన్నకుమార్‌రెడ్డి వెంటే ఉంటానని, తన శత్రువైన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎమ్మెల్యేగా నిలబడితే సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పాను. ఇందుకు బీద సరే తన కార్యాలయం వరకు వదలమని కోరాడు. బీఎంఆర్ కార్యాలయం వద్దకు వెళ్లగానే లోపలి వరకు రమ్మని పిలిచాడు. టీడీపీ కార్యాలయం కాదు కదా బీఎంఆర్ కార్యాలయమని లోపలికి వెళ్లగా అక్కడ కొందరు టీడీపీలో చేరుతున్నారు. వారితో పాటు బీద తనకు పార్టీ కండువాను బలవంతంగా కప్పాడు. దీంతో తాను అక్కడి నుంచి బయల్దేరి ఇంటికి వచ్చేశాను. తాను ఎట్టిపరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని కైలాసం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment