Namo venkatesaya
-
హరే కృష్ణ!
సైకిల్ చైన్ పట్టుకుని విలన్లను రఫ్ఫాడించిన హీరో.. ‘హలో గురూ ప్రేమ కోసమేనోయ్ జీవితం..’ అని రొమాంటిక్ పాట పాడిన హీరో... భక్తుడిగా కనిపిస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తే అంగీకరించేస్తారు. అందుకు ఉదాహరణ ‘అన్నమయ్య’. అప్పటివరకూ చేసిన ‘శివ’, ‘నిర్ణయం’, ‘గీతాంజలి’ చిత్రాల ద్వారా తనలో మంచి మాస్ హీరో, రొమాంటిక్ హీరో ఉన్న విషయాన్ని నాగ్ నిరూపించుకున్నారు. ఈ చిత్రాలకు పూర్తి వ్యత్యాసంగా ఉండే ‘అన్నమయ్య’లో నాగ్ అభినయం కేక. ఆ తర్వాత చేసిన ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ కూడా నాగ్ భక్తి చిత్రాలకు పనికొస్తారని బలంగా చెప్పాయి. ఇప్పుడు ‘నమో వేంకటేశాయ’లో వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా నటించారు. ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. భవిష్యత్తులో నాగార్జున నుంచి మరో భక్తిరసాత్మక చిత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పొచ్చు. ‘అన్నమయ్య’, ‘శిరిడీ సాయి’, ‘నమో వేంకటేశాయ’ చిత్రాలకు రచయితగా వ్యవహరించిన జేకే భారవి ప్రస్తుతం మరో భక్తి కథ సిద్ధం చేసే పని మీద ఉన్నారు. ఆధ్యాత్మిక గురువు, ‘ఇస్కాన్’ (అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం) ఫౌండర్ అయిన స్వామి ప్రభుపాద జీవితం ఆధారంగా ఆయన ఈ కథ తయారు చేస్తున్నారట. కృష్ణుడి భక్తుని జీవితంతో సినిమా కాబట్టి, దీన్ని ‘ఇస్కాన్’ ఫౌండేషన్ నిర్మించడానికి ఆసక్తిగా ఉందని సమాచారం. ఈ చిత్రకథను క్లుప్తంగా నాగ్‌కి భారవి వినిపించారట. ఇక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం. -
నమో వేంకటేశాయ...ఆ రోజు వస్తారయ!
‘‘ఏమో గ్రాఫిక్స్‌కి చాలా టైమ్ పట్టేటట్లుంది. అంత టైమ్ తీసుకుంటేనే సినిమా క్వాలిటీగా ఉంటుంది. అందుకని విడుదల తేదీ చెప్పడం కష్టం’’ అని ‘నమో వేంకటేశాయ’ గురించి నాగార్జున చెప్పి పది రోజులైంది. ఇప్పుడు గ్రాఫిక్స్‌కి ఎంత టైమ్ పడుతుందో చిత్ర దర్శక-నిర్మాతలు కె. రాఘవేంద్రరావు, ఎ. మహేశ్రెడ్డిలకు ఓ క్లారిటీ వచ్చేసినట్లుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ తర్వాత రాఘవేంద్రరావు -నాగార్జున కాంబినేషన్లో రూపొందుతోన్న భక్తిరసా త్మక చిత్రం ఇది. హాథీ రామ్ బాబాగా నాగ్, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్ జైన్, భక్తు రాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ఇంకా పలు వురు ప్రము ఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. వారిలో ‘కంచె’ చిత్ర ఫేవ్‌ు అయిన కథానాయిక ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఉన్నారు. నాగ్-ప్రజ్ఞా జైస్వాల్‌ల మీద ఇటీవల ఓ పాట చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ చిత్ర బిజినెస్ కూడా బాగుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పని జరుగుతోంది’’ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు జోడీ... ప్రజ్ఞా జైస్వాల్ భక్తిరస్మాతక చిత్రం ‘నమో వేంకటేశాయ’ చిత్రంలో నటించిన తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ ఓ లవ్ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని అంగీకరించారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రంలో ఒక కథానాయికగా రకుల్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజ్ఞా జైస్వాల్‌ని మరో నాయికగా తీసుకున్నామని గురువారం నిర్మాత తెలిపారు. కథానాయికలిద్దరికీ సమాన ప్రాధాన్యం ఉంటుందనీ, ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామనీ అన్నారు. బోయపాటి మార్క్ యాక్షన్‌తో సాగే చిత్రమని కూడా తెలిపారు.