న్యూఢిల్లీ : ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులకు అనుమతిచ్చి జాతి మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన మోదీ.. మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న గీతా ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఇస్కాన్ అధ్వర్యంలో నిర్వహించిన భారీ భగవద్గీత ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం మోదీ ఇలా మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. 670 పేజీలు, 800 కిలోల బరువైన అతి భారీ భగవద్గీతను మోదీ ఆవిష్కరించారు. ప్రస్తుతం మోదీ మెట్రో జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వయొలెట్ లైన్ లోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్‌లో ప్రధాని మోదీ మెట్రో రైలు ఎక్కారు. అనంతరం కోచ్‌లో ఉన్న ప్రయాణికులతో మాట కలిపారు. అయితే మోదీ పక్కన అందరూ ముస్లిం కూర్చుని ఉండటం గమనార్హం. మోదీని చూసిన ఆనందంలో ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తర్వాత ప్రధాని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్‌లో దిగారు. ప్రధాని మెట్రో ప్రయాణం దృష్ట్యా ఆ మార్గం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు.
Let this video speak for itself! 👍 pic.twitter.com/dNHOoEs4cr
— Aman Sharma (@AmanKayamHai_ET) February 26, 2019
Comments
Please login to add a commentAdd a comment