సాక్షి, ముంబై: టీబీ రోగులకు త్వరలో పౌష్టిక ఆహారం అందనుంది. ఇకమీదట ఇస్కాన్ వారు వీరికి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించనున్నారు. శివ్డీలోని కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే టీబీ ఆస్పత్రిలోని రోగులకు ఇస్కాన్ సంస్థ ఈ ఆహారాన్ని అందించనుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా జీటీబీ ఆస్పత్రిలో ఆహారం సరిగ్గా ఉండడం లేదంటూ కొన్ని రోజులు గా కార్పొరేషన్‌కు ఫిర్యాదులందుతున్నాయి.
టీబీ రోగులకు మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాల్సి ఉంటుంది. వీరు ఉపయోగించే ఔషధాలకు మంచి ఆహారం తీసుకుంటేనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఓ వైద్యుడు తెలిపారు. ఈ ఆస్పత్రిలోనే ఓ వంట గదిని ఏర్పాటు చేయనున్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వైద్య విభాగం కార్యనిర్వాహక అధికారి పద్మజ కేస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీటీబీ ఆస్పత్రి రోజుకు 800 మంది రోగులకు వైద్యసేవలు అందిస్తోంది. వీరికి ఉదయం బ్రెడ్, మధ్యాహ్నం భోజ నంలోకి బ్రెడ్, పప్పు లేదా కూరగాయలను అందజేస్తున్నారు.
ఇక విలేపార్లేలోని కూపర్ ఆస్పత్రి రోగులకు కూడా మరిన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని ఇస్కాన్ సంస్థ అందజేసేందు కు వీలుగా కార్పొరేషన్ అవసరమైన చర్య లు తీసుకోనుంది. ఈ విషయమై పరిపాలనా విభాగం సలహాదారుడు రాధాకృష్ణ దాస్ మాట్లాడుతూ వైద్యులు సూచించిన మేరకు రోగులకు భోజనాన్ని అందజేస్తామన్నారు. గదిని కేటాయించగానే వెంటనే వంటకు సంబంధించిన యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు.
టీబీ రోగులకు పౌష్టికాహారం
Published Sun, Sep 7 2014 10:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement