అందరికి పర్యాటకం..
అందరికి పర్యాటకం..
Published Tue, Sep 27 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
– అదే ఈ ఏడాది మన నినాదం
– ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో వక్తలు
– ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సంరక్షించుకోవడం అందరి బాధ్యతని కేంద్ర పురావస్తుశాఖ కర్నూలు రీజియన్ పరిరక్షకులు కృష్ణచైతన్య అన్నారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నగరంలోని లలిత కళాసమితిలో ఘనంగా జరిగాయి. ఏకో టూరిజం, అగ్రీ టూరిజం, హెల్త్ టూరిజం, కల్చరల్ టూరిజం, టెంపుల్ టూరిజం అవకాశాలను, విశిష్టతలను ఈ సందర్భంగా వ్యక్తలు వివరించారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ... ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకొని ఈ ఏడాది నినాదం అందరికీ పర్యాటకం పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు వివరించారు. జిల్లా పర్యాటక సంస్థ డీవీఎం సుదర్శన్‌రావు మాట్లాడుతూ...రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని వివరించారు. జిల్లా పర్యాటక అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.ఉస్మానియా, కేవీఆర్, టౌన్ మోడల్, హజీర కళాశాలల విద్యార్థులకు పోస్టర్ పెయింటింగ్, క్విజ్ పోటీలు, పేపర్ ప్రజెంటేషన్, ఫొటోగ్రఫీ వంటి వాటిపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు కిష్టన్న, నగర ప్రముఖులు చంద్రశేఖర్ కల్కూర, మద్దయ్య, రచయిత సంఘం నేత వేణుగోపాల్ రావు, ప్రోగ్రామ్ కో ఆర్డీనేటర్ ఆదిశేషులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement