పుష్కర కల్చరల్ (కొవ్వూరు) : సంబరాలు జరుగుతుంటే వాటికి సాంస్కృతిక తళుకులు మరింత వన్నె తెస్తాయి. అలాంటి సాంస్కృతిక కళారూపాల జాడ కొవ్వూరు పట్టణంలో కనిపించడం లేదు. అసలు గోదావరి పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకు అనుకున్నారో ఏమో ఈ విషయంలో చాలా చిన్న చూపు చూశారు. పట్టణానికి అనువుగా ఉండే ప్రాంతంలో కళారూపాలను ప్రదర్శించాలి. ఇలాంటి వాటి కోసం నిర్ధేశించిన ఒక స్థలాన్ని స్థానిక టీడీపీ నేత అనుయాయులకు అప్పగించడానికి ఊరికి దూరంగా పుష్కరనగర్ వద్ద ఒక వేదిక, ఇందిరమ్మ కాలనీ వద్ద మరో కళావేదిక ఏర్పాటు చేశారు.
పుష్కర ఆరంభం నుంచి పుష్కరాల ముగింపు వరకు షెడ్యూల్‌లో 50 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు అట్టహాసంగా ప్రకటించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాలకు ముందుగా షెడ్యూల్‌లో ప్రకటించిన వాటికి పొంతనే లేదు. జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రాచుర్యం పొందిన కళాకారుల కళారూపాలను ఏర్పాటు చేసినట్టు సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ స్థారుు అధికారి ముందుగా పేర్కొన్నారు. తీరా స్థానికంగా కొందరు కళాకారులతో కళారూపాలు ప్రదర్శిస్తూ మమ అనిపిస్తున్నారు.
దీంతో ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న తీరును సంబంధిత అధికారి వద్ద ‘సాక్షి’ ప్రశ్నించగా నేను కో-ఆర్డినేటర్‌ను మాత్రమేనని అంతా ఉన్నతాధికారులే చూసుకుంటారని చెప్పారు. సమాచార పౌరసంబంధాల శాఖ అధికారులు సదరు ఏడీ స్థాయి అధికారిని అడిగితే కార్యక్రమాల ఏర్పాట్లను మీరే చూసుకోవాలంటూ చెప్పారు. పుష్కరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలపై అధికారులకు ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి తెలుస్తోంది. అధికారులు ఇప్పుడైనా శ్రద్ధ చూపితే భక్తులు మంచి కళారూపాలు చూడగలుగుతారు.
‘కళ’ తప్పించారు
Published Fri, Jul 17 2015 1:48 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement