వర్సిటీలో ‘యువ’ సవ్వడి | Cultural composition to prepare everything | Sakshi
Sakshi News home page

వర్సిటీలో ‘యువ’ సవ్వడి

Published Tue, Feb 4 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

Cultural composition to prepare everything

  •     సాంస్కృతిక సమ్మేళనానికి సర్వం సిద్ధం
  •      50 అంశాలలో పోటీలు
  •      విద్యార్థులకు ఆహ్వానం
  •  ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : అదొక ఉత్కృష్ట శిఖరం. జ్ఞాన ప్రదాయనిగా నిలిచే అక్షయ పాత్ర. యువతకు విద్యా రంగంతో పాటు క్రీడా, సాంస్కృతిక, సాహిత్య, సృజనాత్మక, సామాజిక సేవా రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమం. ప్రతిభ ఉన్నవారికి పట్టం కట్టే వేదిక. అదే మన ఆంధ్ర విశ్వకళాపరిషత్. తన పేరులో ఉన్న కళలను నిత్యం విద్యార్థులకు పరిచయంచేస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 8, 9 తేదీలలో రాష్ట్రస్థాయి సాంస్కృతిక యువ సమ్మేళన ఏయూ ఏక్మీ 2014కు రూపకల్పన చేసింది. 35 రోజుల పాటు 50 అంశాలలో యువత పోటీపడి ప్రతిభను చాటే అవకాశం కల్పించింది. రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది.
     
    కార్యక్రమాల వివరాలు : ఆరు విభాగాలలో 50 అంశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ పోటీలు మార్చి 8 వరకు ప్రతి రోజూ నిర్వహిస్తారు. చివరి రెండు రోజులలో యువతను ఉర్రూతలూగించే సాంస్కృతిక సంబరం జరగనుంది. విద్యార్థులు వెంటనే పేర్లు నమోదు చేసుకుని ఆయా అంశాలలో పోటీకి దిగవచ్చు.
     
     సాంస్కృతిక విభాగం : లేజర్ షో, సోలో డ్యాన్స్, గ్రూప్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, సింగింగ్, కరోకే, అంత్యాక్షరి, రాక్‌బ్యాండ్, ఫ్యాషన్ షో, కైట్ ఫ్లైయింగ్, స్పాట్ డ్యాన్సింగ్, సోలో మ్యూజిక్, డంబ్ చారడిస్.
     
     సృజనాత్మక రంగం : థీమ్ ఫొటోగ్రఫీ, కాన్సెప్ట్ రంగోళి, థీమ్ డ్రాయింగ్, బెస్ట్ విత్ వేస్ట్, ఫ్లవర్ డెకరేషన్, వెజిటబుల్ కార్వింగ్, పోస్టర్ మేకింగ్, క్లే మౌడలింగ్, పాట్ పెయింటింగ్, వర్సిటీపై డాక్యుమెంటరీ.
     
     లిటరరీ విభాగం : వ్యాసరచన, వక్తృత్వం, వాదం ప్రతివాదం, ఎక్స్‌టెంపోర్, స్పెల్ బీ, ఒరిజినల్ స్టోరీ రైటింగ్, క్విజ్, రికార్డెడ్ ఇంటర్వ్యూ.
     
     సామాజిక అంశాలు : సైక్లింగ్, స్లో రేసింగ్, క్యాంపస్, క్లీనింగ్, 2 కె రన్, మొక్కలు నాటడం.
     
     క్రీడలు : క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, స్నూకర్, టెన్నీకాయిట్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, త్రోబాల్.
     
     ఫన్నీ గేమ్స్ : ఇంక్ ఏ ట్రి, టగ్ ఆఫ్ వార్, హల్లా బోల్, స్ట్రీట్ ఫుట్‌బాల్, లవ్ లెటర్ రైటింగ్, ఆర్మ్ వెస్ట్రిలింగ్, ట్రెజర్ హంట్, సైలాంతర్స్, లాన్ గేమింగ్, మూవీ ఆన్ ద గో, సెవెన్ స్టోన్స్, స్టెప్ ఏ స్టోన్.
     
     ఎవరు అర్హులు : ఆంధ్ర రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థులంతా ఇందులో పాల్గొనేందుకు అర్హులే.
     
     అన్ని రంగాలలో ప్రోత్సాహం
     విద్యా, సాంస్కృతిక, మేధో, క్రీడా విభాగాలలో విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దేందుకు వర్సిటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా విభిన్న అంశాలతో కల్చరల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాం.
     - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, వీసీ. ఏయూ.
     
     ఎలా సంప్రదించాలి
     ఏయూ-ఏక్మీ సాంస్కృతిక యువజన ఉత్సవాలలో పాల్గొనాలనుకునే యువతరం 90303 03636, 93999 62023, 98496 13354 నంబర్లలో, www.AUACME.com  వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఫెస్ట్ కార్యాలయంలో సైతం నేరుగా సంప్రదించవచ్చు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement