తెలంగాణ కళలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ కళలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ తెలిపారు. రాష్ట్ర యువజనోత్సవాలు ముగింపు కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పారామంలో ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసమయి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి విభాగం ఏర్పడిన తర్వాత 500 మంది కళాకారులకు ఉపాధి లభించిందని తెలిపారు. ఆకలి కేకలు, ఆర్తనాదాల నుంచి తెలంగాణ పాటలు, కళలు పుట్టుకొచ్చాయని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక విభాగం డిప్యూటి డెరైక్టర్ ఉష, వివేకానంద ఇనిస్టిట్యూట్ ప్రతినిధి గోదానంద స్వామి పాల్గొన్నారు.