యువజనోత్సహం
యువజనోత్సహం
Published Sat, Dec 3 2016 10:00 PM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM
ఆకట్టుకున్న సాంస్కృతిక పోటీలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. డివిజనల్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారితో ఈ పోటీలు నిర్వహించారు. పోటీలను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రారంభించారు. అనంతరం ఇటీవలే మరణించిన గాయకులు మంగళం పల్లి బాల మురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పత్తి ఓబులయ్య మాట్లాడుతూ జిల్లా స్థాయి విజేతలు ప్రావీణ్యతను ఇంకా మెరుగుపరచుకోవాలని సూచించారు. ఇందుకుగాను తమ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పోటీల అనంతరం సాయంత్రం బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ మస్తాన్‌వలి, మేనేజర్ పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఎంపికైన వారు
కూచిపూడి నృత్యం
1. ఎస్. మానస, 2, అర్చన, 3. శాంభవి
జానపద నృత్యం
1. లక్ష్మి, అనూష గ్రూప్, 2. స్వప్న, జితేష్ గ్రూప్
భరతనాట్యం
1. రాధ
వక్తృత్వ పోటీలు
1. సుస్మితారెడ్డి
సంప్రదాయ సంగీతం(హిందుస్తానీ)
1. కె. యశ్వంతి, 2. ఎన్. మునివన్నూరమ్మ
కర్ణాటక సంగీతం
1.జీఎం చంద్ర లిఖిత
క్లాసికల్ ఇన్‌స్టుమెంట్స్
1. ఎం. ముని సాయిరామ్(డోలి), 1. ఎం. తిరుమల(తబల), 2. బి. జి. నాగవీణకుమార్(తబల), 1. ఎం. డోనాల్డ్ డిక్(గిటార్), 1. వై. వెంకటేష్ బాబు(వీణ), 1. అశ్వత్ కుమార్(హార్మోనియం)
ఫోక్ సాంగ్ గ్రూప్
1. రాజ్‌కుమార్ అండ్ గ్రూప్, ప్రభుత్వ శారద సంగీత కళాశాల, కర్నూలు
ఏకపాత్రభినయం
1. సుశాంత్ ఫిలిప్స్ అండ్ గ్రూప్, సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల, కర్నూలు.
Advertisement
Advertisement