ఏటీపీ చాలెంజర్ టోర్నీ
కోల్‌కతా: సింగిల్స్‌లో విఫలమైనప్పటికీ... డబుల్స్‌లో రాణించిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కోల్‌కతా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి జీవన్ నెదున్‌చెజియాన్‌తో జతకట్టిన సోమ్‌దేవ్‌కు ఫైనల్లో ఆడాల్సిన అవసరం రాలేదు.
భారత జోడీతో తలపడాల్సిన జేమ్స్ డక్‌వర్త్-ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయం గాయం కారణంగా ‘వాకోవర్’ ఇచ్చింది. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 91 వేలు) లభించింది. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాడూ అల్బోట్ (మాల్దొవా) 7-6 (7/0), 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు.
సోమ్‌దేవ్ జంటకు డబుల్స్ టైటిల్
Published Sun, Mar 1 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement