ATP challenger tournment
-
సాకేత్ సంచలనం
బెంగళూరు: తన విజయ పరంపర కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 6–4, 6–4తో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్ నాగల్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. 56 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కూడా సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్లో శశికుమార్ ముకుంద్ (భారత్) నుంచి ప్రజ్నేశ్‌కు ‘వాకోవర్’ లభించింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–3, 2–6, 8–10తో పురవ్ రాజా (భారత్)–సాన్సిచ్ (క్రొయేషియా) జోడీ చేతిలో ఓడింది. -
సోమ్‌దేవ్ జంటకు డబుల్స్ టైటిల్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ కోల్‌కతా: సింగిల్స్‌లో విఫలమైనప్పటికీ... డబుల్స్‌లో రాణించిన భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ కోల్‌కతా ఓపెన్‌లో టైటిల్ సాధించాడు. భారత్‌కే చెందిన తన భాగస్వామి జీవన్ నెదున్చెజియాన్తో జతకట్టిన సోమ్‌దేవ్‌కు ఫైనల్లో ఆడాల్సిన అవసరం రాలేదు. భారత జోడీతో తలపడాల్సిన జేమ్స్ డక్‌వర్త్-ల్యూక్ సావిల్లె (ఆస్ట్రేలియా) ద్వయం గాయం కారణంగా ‘వాకోవర్’ ఇచ్చింది. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 91 వేలు) లభించింది. అంతకుముందు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రాడూ అల్బోట్ (మాల్దొవా) 7-6 (7/0), 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. -
టాప్ సీడ్‌కు సాకేత్ జంట షాక్
ఏటీపీ చాలెంజర్ టోర్నీ న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ ప్లేయర్ సాకేత్ మైనేని డబుల్స్ విభాగంలో సంచలనం సృష్టించాడు. సనమ్ సింగ్ (భారత్)తో కలిసి తొలి రౌండ్లో టాప్ సీడ్ జంట ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) -పురవ్ రాజా (భారత్)కు షాక్ ఇచ్చాడు. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్-సనమ్ సింగ్ జంట 6-4, 7-5తో మార్టిన్-పురవ్ రాజాలను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగి ల్స్‌లో భారత్‌కే చెందిన యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్, రామ్‌కుమార్, సనమ్ సింగ్ రెండో రౌండ్‌కి చేరారు.