సోమ్‌దేవ్‌కు టైటిల్ | Somdev Devvarman calls Delhi Open win 'best of career' | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్‌కు టైటిల్

Published Mon, Feb 24 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

సోమ్‌దేవ్‌కు టైటిల్

సోమ్‌దేవ్‌కు టైటిల్

న్యూఢిల్లీ: నాలుగేళ్ల విరామం తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో సోమ్‌దేవ్ టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)ను ఓడించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సోమ్‌దేవ్ 6-3, 6-1తో నెదోవ్‌యెసోవ్‌పై గెలిచాడు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని అతను అంతిమపోరులోనూ అదే జోరు కొనసాగించాడు.
 
 మూడు ఏస్‌లు సంధించిన ఈ భారత నంబర్‌వన్... తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్‌కు 14,400 డాలర్ల (రూ. 8 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సోమ్‌దేవ్‌కిది మూడో ఏటీపీ టైటిల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement