ATP challenger
-
ఏటీపీ కప్‌నుంచి తప్పుకున్న జొకోవిచ్..
వరల్డ్ నంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ 2022 తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. శనివారంనుంచి సిడ్నీలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ సన్నాహక టోర్నీ ఏటీపీ కప్‌నుంచి అతను తప్పుకోవడం దీనికి మరింత బలం చేకూర్చింది. వ్యాక్సినేషన్ పూర్తయినవారే ఆడాలంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు విధించగా... వ్యాక్సిన్ వేసుకోని జొకోవిచ్ మొదటినుంచి దీనిని వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. చదవండి: SA Vs IND: "అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్.. దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్నాడు" -
రన్నరప్ సాకేత్ జోడీ
పుణే: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాకేత్ మైనేని–అర్జున్ ఖడే (భారత్) ద్వయం 6–7 (3/7), 3–6తో టాప్ సీడ్ రామ్‌కుమార్ రామనాథన్–పురవ్ రాజా (భారత్) జోడీ చేతిలో ఓడిపోయింది. విజేత రామ్‌కుమార్–పురవ్ జంటకు 3100 డాలర్లు (రూ. 2 లక్షల 22 వేలు), రన్నరప్ సాకేత్–అర్జున్ జోడీకి 1800 డాలర్లు (రూ. లక్షా 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఒకేసారి 26 ర్యాంకులు ఎగబాకాడు..
న్యూఢిల్లీ: తన కెరీర్లో రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్ సాధించిన భారత టెన్నిస్ సంచలనం సుమీత్ నాగల్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఆదివారం ముగిసిన బ్యూనోస్ ఎయిర్స్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో విజేతగా నిలిచిన నాగల్ ఏకంగా 26 ర్యాంకులు ఎగబాకాడు. ఫలితంగా సోమవారం విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 135వ ర్యాంకులో నిలిచాడు. ఇది సుమీత్ నాగల్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకుగా నిలిచింది. నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో నాగల్ 6-4, 6-2 తేడాతో బాగ్నిస్(అర్జెంటీనా)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. తొలి సెట్‌ను గెలవడానికి కాస్త శ్రమించిన నాగల్.. రెండో సెట్‌ను సునాయాసంగా గెలుపొందాడు. అద్భుతమైన ఏస్‌లతో ఆకట్టుకున్న నాగల్ దూకుడుగా ముంద బాగ్నిస్ తలవంచక తప్పలేదు. కేవలం 37 నిమిషాల్లో బాగ్నిస్‌ను ఓడించి తన రాకెట్ పవర్‌ను చూపించాడు.ఇటీవల యూఎస్ గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించిన 22 ఏళ్ల నాగల్.. తొలి రౌండ్లో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చేతిలో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను గెలిచినా మిగతా రెండు సెట్లు కోల్పోయి ఓటమి పాలయ్యాడు. కాకపోతే ఒక గ్రాండ్ స్లామ్లో ఫెడరర్‌పై కనీసం సెట్ గెలిచిన తొలి భారత టెన్నిస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే ఫెడరర్ చేత మన్ననలు కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతి పెద్ద విజయాలను సాధించే సత్తా నాగల్లో ఉందంటూ ఫెడరర్ కొనియాడాడు. -
సోమ్‌దేవ్‌కు టైటిల్
న్యూఢిల్లీ: నాలుగేళ్ల విరామం తర్వాత భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ ఫైనల్లో సోమ్‌దేవ్ టాప్ సీడ్ అలెగ్జాండర్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)ను ఓడించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సోమ్‌దేవ్ 6-3, 6-1తో నెదోవ్యెసోవ్పై గెలిచాడు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ కూడా కోల్పోని అతను అంతిమపోరులోనూ అదే జోరు కొనసాగించాడు. మూడు ఏస్‌లు సంధించిన ఈ భారత నంబర్‌వన్... తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన సోమ్‌దేవ్‌కు 14,400 డాలర్ల (రూ. 8 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా సోమ్దేవ్కిది మూడో ఏటీపీ టైటిల్.