రన్నరప్‌ సాకేత్‌ జోడీ | Saketh Pair Settele As Runner Up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాకేత్‌ జోడీ

Published Mon, Nov 18 2019 10:02 AM | Last Updated on Mon, Nov 18 2019 10:02 AM

Saketh Pair Settele As Runner Up - Sakshi

పుణే: అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) చాలెంజర్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు సాకేత్‌ మైనేని పురుషుల డబుల్స్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో సాకేత్‌ మైనేని–అర్జున్‌ ఖడే (భారత్‌) ద్వయం 6–7 (3/7), 3–6తో టాప్‌ సీడ్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌–పురవ్‌ రాజా (భారత్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. విజేత రామ్‌కుమార్‌–పురవ్‌ జంటకు 3100 డాలర్లు (రూ. 2 లక్షల 22 వేలు), రన్నరప్‌ సాకేత్‌–అర్జున్‌ జోడీకి 1800 డాలర్లు (రూ. లక్షా 28 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement