సోమ్‌దేవ్ శుభారంభం | good start from somdev | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ శుభారంభం

Published Tue, Feb 11 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

good start from somdev

 కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ 6-4, 6-4తో మహ్మద్ సఫ్‌వత్ (ఈజిప్ట్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో భారత్‌కే చెందిన సనమ్ సింగ్ 6-1, 5-7, 4-6తో డానియల్ కాక్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు.
 
 క్వార్టర్స్‌లో సాకేత్ జోడి
 డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాకేత్ మైనేని తన భాగస్వామి సనమ్ సింగ్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. తొలి రౌండ్‌లో సాకేత్-సనమ్ సింగ్ ద్వయం 6-2, 4-6, 10-8తో రామ్‌కుమార్ రామనాథన్-కరుణోదయ్ సింగ్ (భారత్) జోడిపై గెలిచింది. మంగళవారం జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తీ చెన్ (చైనీస్ తైపీ)తో విష్ణువర్ధన్; ఎవగెని డాన్‌స్కాయ్ (రష్యా)తో సాకేత్ మైనేని; లియాంగ్ హువాంగ్ (చైనీస్ తైపీ)తో యూకీ బాంబ్రీ తలపడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement