హూస్టన్ (అమెరికా) : యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్‌కు చేరుకున్నాడు. రాబీ జినెప్రి (అమెరికా)తో జరిగిన రెండో రౌండ్‌లో సోమ్‌దేవ్ 7-6 (8/6), 6-3తో విజయం సాధించాడు. తన సర్వీస్‌లో పదిసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను కాపాడుకున్న సోమ్‌దేవ్ ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. గిలెర్మి క్లెజార్ (బ్రెజిల్)తో జరిగే ఫైనల్ రౌండ్‌లో గెలిస్తే సోమ్‌దేవ్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు.