
సోమ్‌దేవ్ శుభారంభం
కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గాయాలతో ఇబ్బందిపడ్డ భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ గాడిలో పడుతున్నాడు. యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ పోటీల్లో బరిలోకి దిగిన అతను రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.
న్యూయార్క్: కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు గాయాలతో ఇబ్బందిపడ్డ భారత టెన్నిస్ స్టార్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మళ్లీ గాడిలో పడుతున్నాడు. యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ పోటీల్లో బరిలోకి దిగిన అతను రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ 6-4, 6-3తో ఎఫ్.డి.పౌలా (బ్రెజిల్)పై విజయం సాధించాడు.
ఈ సీజన్ ముగిసేవరకు టాప్-100 మళ్లీ చోటు సంపాదించడమే తన లక్ష్యమని విజయా నంతరం ఈ భారత స్టార్ అన్నాడు. 2011 మధ్యలో సింగిల్స్‌లో మెరుపులు మెరిపించిన సోమ్‌దేవ్ కెరీర్ బెస్ట్ (62వ) ర్యాంక్‌ను అందుకున్నాడు. కానీ అదే ఏడాది చివర్లో భుజానికి గాయం కావడంతో 2012 లో క్రమంగా అతని కెరీర్ గ్రాఫ్ దిగజారింది. అయితే ఈ ఏడాది కొన్ని చాలెంజర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడంతో 113వ ర్యాంక్‌లోకి వచ్చాడు.