సోమ్‌దేవ్ ఓటమి | Somdev Devvarman crashes out of Chennai Open in first round | Sakshi
Sakshi News home page

సోమ్‌దేవ్ ఓటమి

Published Wed, Jan 7 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

సోమ్‌దేవ్ ఓటమి

సోమ్‌దేవ్ ఓటమి

చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్‌లోనే భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 3-6, 4-6తో ఆరో సీడ్ యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. సోమ్‌దేవ్‌తోపాటు రామ్‌కుమార్ రామనాథన్, విజయ్ సుందర్ ప్రశాంత్ కూడా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.

రామ్‌కుమార్ 3-6, 3-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో; ప్రశాంత్ 2-6, 1-6తో జిరీ వెసిలి (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 6-4తో ఆండ్రియా హైదర్ (ఆస్ట్రియా)-లుకాస్ లాకో (స్లొవేకియా) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement