Chennai Open tennis
-
Chennai Open WTA 2022: కర్మన్‌కౌర్ సంచలనం
చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణి కర్మన్‌కౌర్ థండి సంచలనం సృష్టించింది. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 359వ ర్యాంకర్ కర్మన్‌కౌర్ 4–6, 6–4, 6–3తో ప్రపంచ 109వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ చోల్ పాక్వె (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కర్మన్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2014 వింబుల్డన్ రన్నరప్ యుజీన్ బుషార్డ్ (కెనడా)తో కర్మన్ ఆడుతుంది. -
విష్ణు–బాలాజీ జోడీకి టైటిల్
చెన్నై: స్వదేశంలో ఈ ఏడాది జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్‌లో విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్ విష్ణు–బాలాజీ ద్వయం 7–6 (7/5), 5–7, 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో సెమ్ ఇల్కెల్ (టర్కీ)–డానిలో పెట్రోవిక్ (సెర్బియా) జోడీని ఓడించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ ఫైనల్లో విష్ణు–బాలాజీ ద్వయం మూడు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయినప్పటికీ... కీలకమైన సూపర్ టైబ్రేక్‌లో భారత జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ కెరీర్లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన భారత జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఫైనల్లో యూకీ మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్), టాప్ సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్స్‌లో యూకీ 7–5, 6–2తో డక్‌హీ లీ (కొరియా)పై, థాంప్సన్ 6–1, 7–6 (7/5)తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై గెలుపొందారు. -
సోమ్‌దేవ్ ఓటమి
చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లోనే భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 3-6, 4-6తో ఆరో సీడ్ యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. సోమ్దేవ్తోపాటు రామ్‌కుమార్ రామనాథన్, విజయ్ సుందర్ ప్రశాంత్ కూడా తొలి రౌండ్లోనే నిష్ర్కమించారు. రామ్‌కుమార్ 3-6, 3-6తో ఇటో తత్సుమా (జపాన్) చేతిలో; ప్రశాంత్ 2-6, 1-6తో జిరీ వెసిలి (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూశారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జంట 6-4, 6-4తో ఆండ్రియా హైదర్ (ఆస్ట్రియా)-లుకాస్ లాకో (స్లొవేకియా) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.