చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ–250 టెన్నిస్ టోర్నీలో భారత క్రీడాకారిణి కర్మన్‌కౌర్ థండి సంచలనం సృష్టించింది. సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 359వ ర్యాంకర్ కర్మన్‌కౌర్ 4–6, 6–4, 6–3తో ప్రపంచ 109వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ చోల్ పాక్వె (ఫ్రాన్స్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కర్మన్ నాలుగు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 2014 వింబుల్డన్ రన్నరప్ యుజీన్ బుషార్డ్ (కెనడా)తో కర్మన్ ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment